మొదటి ఆటకే మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకుంది, సినిమా లౌడ్ గా ఉందని, రొటీన్ కథ స్క్రీన్ ప్లే తో వచ్చింది అంటూ ఇస్మార్ట్ శంకర్ మూవీకి వచ్చినట్లే టాక్ వచ్చినా కూడా ఇక్కడ ఒక్క ఎపిసోడ్ వలన అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ మిక్సుడ్ టాక్ స్ప్రెడ్ అవుతుంది అని చెప్పాలి…
అదే సినిమా కి సంభందం లేకుండా వచ్చే ఆలీ కామెడీ ట్రాక్…ఒకప్పుడు పూరీ జగన్నాథ్ సినిమాల్లో హైలెట్ అయ్యే ఆలీ కామెడీ ట్రాక్ తర్వాత టైం లో ఔట్ డేటెడ్ అయిపోగా చాలా టైం ఈ సైడ్ కామెడీ ట్రాక్ ను పెట్టడం ఆపేశారు..కానీ డబుల్ ఇస్మార్ట్ లో కథకి ఏమాత్రం సింక్ లేని విధంగా…
ఆలీ కామెడీ ట్రాక్ చూస్తున్న ఆడియన్స్ కి ఏమాత్రం నవ్వు తెప్పించలేక పోయింది సరికదా మరింత చిరాకు తెప్పించింది అని చెప్పాలి…గట్టిగా చెప్పాలి అంటే రీసెంట్ టైంలోనే ఏ సినిమా లో కూడా లేని జుగుప్సాకరమైన కామెడీ ట్రాక్ అని చెప్పొచ్చు….దాంతో ఆ ట్రాక్ వలన సినిమాకి మరింతగా మైనస్ జరుగుతూ ఉండగా…
సోషల్ మీడియాలో సినిమా చూసిన వాళ్ళు అందరూ కూడా ఆ ట్రాక్ మినహా చాలా వరకు సినిమా ఇస్మార్ట్ శంకర్ తో మ్యాచ్ చేసేలానే ఉందని అంటూ ఉండగా చాలా మంది ఆలీ కామెడీ ట్రాక్ ను తీసేస్తే సినిమా టాక్ వీకెండ్ లో చాలా వరకు సెటిల్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు…..
ఈ సారి వర్కౌట్ అవుతుంది అనుకున్న ఆలీ ట్రాక్ ఈ రేంజ్ లో బాక్ వైర్ కొట్టగా కథకి పెద్దగా సింక్ కూడా లేక పోవడంతో ఎడిటింగ్ లో ఇప్పుడు డిలేట్ చేసినా కూడా పెద్దగా ఇబ్బంది ఉండదు కాబట్టి మేకర్స్ ఎంత త్వరగా తేరుకుని ఆ ట్రాక్ ను ట్రిమ్ చేస్తే సినిమాకి అంత ప్లస్ అవుతుందని చెప్పొచ్చు. మరి మేకర్స్ ఏం చేస్తారో చూడాలి ఇప్పుడు.