బాక్స్ ఆఫీస్ దగ్గర ఆగస్టు 15న భారీ గా రిలీజ్ కి సిద్ధం అవుతున్న ఉస్తాద్ రామ్ పోతినేని(Ram Pothineni) నటించిన ఇస్మార్ట్ శంకర్(iSmart Shankar) సీక్వెల్ మూవీ అయిన డబుల్ ఇస్మార్ట్(Double iSmart) మూవీ మీద ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ ను టార్గెట్ చేసిన…
ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏమాత్రం పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నా కూడా సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపే అవకాశం ఉండగా మరో పక్క బిజినెస్ పరంగా అన్ని ఏరియాల్లో ఎక్స్ లెంట్ బిజినెస్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోయిన సినిమా…
ఒక్క ఏరియాలో మాత్రం రిలీజ్ కి ఇబ్బందులు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది…మిగిలిన ఏరియాల్లో మంచి బిజినెస్ ను సొంతం చేసుకుంటూ రచ్చ చేస్తున్న ఈ సినిమాకి ఇప్పటి వరకు నైజాం ఏరియాలో బిజినెస్ పరంగా మాత్రం ఎలాంటి డీల్స్ ఇంకా ఫైనల్ అవ్వలేదని తెలుస్తుంది…
దానికి కారణం పూరీ జగన్నాథ్ ప్రీవియస్ మూవీ లైగర్ నష్టాల ఎఫెక్ట్ వలన చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు కొనడానికి ముందుకు రావడం లేదని తెలుస్తుంది. దాంతో ఇతర ఆగస్టు 15 మూవీస్ ఒక పక్క థియేటర్స్ అగ్రిమెంట్ లు సాలిడ్ గా జరుపుకుంటూ ఉండగా….
మంచి క్రేజ్ నడుమ వస్తున్న డబుల్ ఇస్మార్ట్ థియేటర్ అగ్రిమెంట్స్ ఏమి జరగకపోవడంతో ప్రస్తుతానికి చాలా తక్కువ థియేటర్స్ లో సినిమా రిలీజ్ కాబోతుందని అంచనా వేస్తున్నారు..మేకర్స్ టాలీవుడ్ బిగ్ హెడ్స్ తో చర్చలు జరిపి ఈ సమస్యని సెట్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నారని…
త్వరలోనే అన్ని సమస్యలు సెట్ అయ్యి గ్రాండ్ గా డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ కి సిద్ధం అవుతుందని ఆశిస్తున్నారు…మంచి క్రేజ్ నడుమ సినిమానే అయినా కూడా ప్రీవియస్ మూవీ ఇంపాక్ట్ ఎఫెక్ట్ అయితే రిలీజ్ రోజు కూడా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.