బాక్స్ ఆఫీస్ దగ్గర 2019 టైంలో వచ్చిన ఉస్తాద్ రామ్ పోతినేని(Ram Pothineni) నటించిన ఇస్మార్ట్ శంకర్(iSmart Shankar) పర్వాలేదు అనిపించే రేంజ్ టాక్ తోనే ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని లాంగ్ రన్ లో ఏకంగా 40 కోట్లకు పైగా షేర్ ని అందుకోగా…రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ మాస్ హిట్ గా నిలిచిన ఆ సినిమాకి….
సీక్వెల్ గా 5 ఏళ్లకి ఆడియన్స్ ముందుకు డబుల్ ఇస్మార్ట్(Double iSmart Movie) రాగా, ట్రైలర్ రిలీజ్ నుండే కొంచం మిక్సుడ్ ఫీలింగ్స్ ఉన్నా మొదటి సినిమా మాదిరిగానే డబుల్ ఇస్మార్ట్ కూడా కుమ్మేస్తుంది అనుకున్నా కూడా మొదటి ఆటకే సినిమా…
బాక్స్ ఆఫీస్ దగ్గర ఎపిక్ డిసాస్టర్ టాక్ ను సొంతం చేసుకోగా…తర్వాత ఏ దశలో కూడా తేరుకోలేక పోయింది. సినిమా మొదటి రోజు 7.30 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇండిపెండెంట్స్ హాలిడే అడ్వాంటేజ్ తో సొంతం చేసుకున్నా మిగిలిన రన్ లో కేవలం 4.25 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని మాత్రమే అందుకుని…
దారుణంగా నిరాశ పరిచింది…రామ్ కెరీర్ లో రీసెంట్ టైంలో ఏ సినిమా కూడా సొంతం చేసుకోలేని రేంజ్ లో లాస్ ను సొంతం చేసుకుని దారుణంగా దెబ్బ కొట్టింది. లైగర్ తర్వాత పూరీ జగన్నాథ్ కోలుకోలేని రేంజ్ లో దెబ్బ కొట్టింది…
ఒకసారి సినిమా టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Double iSmart Movie Total WW Collections(Inc GST)
👉Nizam: 4.01Cr~
👉Ceeded: 1.45Cr
👉UA: 1.17Cr
👉East: 75L
👉West: 43L
👉Guntur: 98L
👉Krishna: 61L
👉Nellore: 35L
AP-TG Total:- 9.75CR(15.40CR~ Gross)
👉Ka+ROI: 1.00Cr
👉OS: 80L
Total WW Collections:- 11.55CR(19.40CR~ Gross)
మొత్తం మీద సినిమా 49 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా టోటల్ రన్ లో టార్గెట్ లో ఏకంగా 37.45 కోట్ల రేంజ్ లో లాస్ ను సొంతం చేసుకుని ట్రిపుల్ ఎపిక్ డిసాస్టర్ గా నిలిచింది…ఈ సినిమా రిజల్ట్ తర్వాత రామ్ ఎలాంటి కంబ్యాక్ ను సొంతం చేసుకుంటాడో చూడాలి ఇక..