బాక్స్ ఆఫీస్ దగ్గర రిమార్కబుల్ కలెక్షన్స్ తో ఈ ఇయర్ ఇప్పటి వరకు కోలివుడ్ తరుపున వచ్చిన మూవీస్ లో ఊరమాస్ రాంపెజ్ ను చూపెడుతూ దూసుకు పోతున్న ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) నటించిన లేటెస్ట్ మూవీ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ (Return Of The Dragon) సినిమా….వీర లెవల్ లో కుమ్మేస్తూ ఉండగా…
సినిమా ఇప్పుడు ఏకంగా కోలివుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైన తల అజిత్ కుమార్(Ajith Kumar) నటించిన లేటెస్ట్ మూవీ విదాముయర్చి(Vidaamuyarchi) మూవీని సైతం క్రాస్ చేసి మాస్ సంచలనం సృష్టించి ఈ ఇయర్ బిగ్గెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని కుమ్మేసింది..
విదాముయర్చి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ రన్ లో ఆల్ మోస్ట్ 142 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను సొంతం చేసుకుని పరుగును పూర్తి చేసుకుని కుమ్మేసింది…కానీ ఎక్స్ ట్రీమ్ నెగటివ్ టాక్ ను సొంతం చేసుకున్నా కూడా ఓవరాల్ గా మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకుంది…
దాంతో ఈ ఇయర్ ఇప్పటి వరకు వచ్చిన మూవీస్ లో ఎక్కువ గ్రాస్ ను అందుకున్న మూవీగా నిలిచింది. ఇక ఇప్పుడు అప్ కమింగ్ స్టార్ అయిన ప్రదీప్ నటించిన డ్రాగన్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు వారాలు పూర్తి కాక ముందే ఈ కలెక్షన్స్ ని బ్రేక్ చేసి..
ఏకంగా కోలివుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైన అజిత్ సినిమా వసూళ్ళనే క్రాస్ చేసి ఇప్పుడు ఏకంగా ఈ ఇయర్ వచ్చిన కోలివుడ్ మూవీస్ లో హైయెస్ట్ గ్రాస్ ను సొంతం చేసుకుని కుమ్మేయడం విశేషం…ఇక అప్ కమింగ్ మూవీస్ ఎలాగూ ఈ టాప్ ప్లేస్ ను బ్రేక్ చేయడం ఖాయం కానీ అప్పటి వరకు డ్రాగన్ టాప్ ప్లేస్ లో కొనసాగుతుంది అని చెప్పాలి.