Home గాసిప్స్ షూటింగ్ అయిపోయి 5 నెలలు…ఆడియన్స్ కి శాకివ్వడం ఖాయమా!!

షూటింగ్ అయిపోయి 5 నెలలు…ఆడియన్స్ కి శాకివ్వడం ఖాయమా!!

1713
0

టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ నుండి రీసెంట్ టైం లో ఆడియన్స్ ఎంతో ఆశగా ఎదురు చూసిన సినిమాలు నారప్ప మరియు దృశ్యం 2 సినిమాలు. ఈ రెండు సినిమాలు సోలో హీరోగా చేస్తున్న సినిమాలు కాగా రీమేక్ మూవీస్ అయినప్పటికీ కూడా ఆడియన్స్ లో సాలిడ్ అంచనాలను పెంచిన ఈ సినిమాలలో నారప్ప సినిమాను నిర్మాతలు ప్రీవియస్ మూవీ నష్టాల కారణంగా వద్దూ అనుకుంటూనే డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ ను చేయగా….

ఫ్యాన్స్ మొదట్లో వద్దూ అంటూ గొడవలు చేసినా తర్వాత పరిస్థితులు అర్ధం చేసుకుని డిజిటల్ లోనే సినిమాను చాలా బాగా ఆదరించారు. నారప్ప డిజిటల్ బ్లాక్ బస్టర్ గా నిలవగా ఈ ఏడాది డిజిటల్ లో వచ్చి అత్యధిక రేటింగ్ ను సొంతం చేసుకున్న సినిమాల్లో ముందు నిలిచిన…

మోహన్ లాల్ దృశ్యం 2 సినిమాను వెంటనే రీమేక్ చేసిన వెంకటేష్ మే నెల లోనే కంప్లీట్ షూటింగ్ మొత్తాన్ని ఫినిష్ చేశారు. అంతలో సెకెండ్ వేవ్ తర్వాత పరిస్థితుల వలన ఈ సినిమా ఊసే లేకుండా పోగా రీసెంట్ గా సెన్సార్ కంప్లీట్ చేసుకుంది అంటూ చెప్పినా తర్వాత ఎలాంటి…

అప్ డేట్ లేకుండా పోయింది. దాంతో అసలు సినిమా పరిస్థితి ఏంటి అంటూ అందరూ ఆలోచనలో పడగా సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యి 5 నెలలు కావోస్తున్నా సినిమా థియేటర్స్ లో వస్తుందా రాదా అన్న అనుమానాలు అలాగే ఉన్నాయి. కాగా ఇండస్ట్రీలో సినిమా పై వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాను డైరెక్ట్ గా డిజిటల్ లోనే రిలీజ్ చేసే ఆలోచన…

ఎక్కువగా ఉందని అంటున్నారు… అమెజాన్ ప్రైమ్ మరియు డిస్నీ ప్లస్ హాట్ స్టార్స్ రెండూ పోటి పడుతున్నాయని, త్వరలోనే డీటైల్స్ రావొచ్చని అంటున్నారు… టీం నుండి కూడా సినిమా రిలీజ్ పై ఇప్పటి వరకు ఎలాంటి అప్ డేట్ లేదు… మరి సినిమాను ఫైనల్ గా థియేటర్స్ లో రిలీజ్ చేస్తారా లేక ఆడియన్స్ కి శాకిచ్చి డిజిటల్ లోనే రిలీజ్ చేస్తారో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here