బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ టైం లో ఏ సినిమా కూడా అంచనాలను అందుకోలేక పోయింది, కొన్ని సినిమాలు కచ్చితంగా ఊచకోత కొస్తాయి అనుకున్నా కూడా ఏమాత్రం ఇంపాక్ట్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించ లేదు, ఇలాంటి టైం లో సౌత్ లో ప్రభంజనం సృష్టించిన దృశ్యం సినిమా సీక్వెల్ డైరెక్ట్ గా డిజిటల్ లోనే రిలీజ్ అవ్వడంతో వ్యూస్ వరకు అయితే దుమ్ము లేపినా కానీ…
బాక్స్ ఆఫీస్ దగ్గర అద్బుతాలు సృష్టించే అవకాశాన్ని మిస్ చేసుకుంది, ఇలాంటి టైం లో బాలీవుడ్ లో అజయ్ దేవగన్ నటించిన దృశ్యం 2 సినిమా థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలని డిసైడ్ అవ్వగా ఆడియన్స్ ఈ సినిమా కి బ్రహ్మరథం పడుతున్నారు ఇప్పుడు…
యునానిమస్ పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకున్న ఈ సినిమా రిలీజ్ అయిన రోజు నుండి 5 రోజుల్లో ఊచకోత కోసే కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది, ఆ కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే…
Day 1 – 15.38Cr
Day 2 – 21.59Cr
Day 3 – 27.17Cr
Day 4 – 11.87Cr
Day 5 – 10.48Cr
Total – 86.49CR
వర్కింగ్ డేస్ లో కూడా సినిమా బాక్స్ ఆఫీస్ రాంపేజ్ కొనసాగుతుంది…
సీన్ టు సీన్ రీమేక్ అయినా కానీ దృశ్యం2 డబ్ హిందీ ఎక్కడా లేక పోవడం ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర ఊచకోత కోయడానికి ఉపయోగ పడింది అని చెప్పాలి. సినిమా లాంగ్ రన్ లో కచ్చితంగా వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ ని అజయ్ దేవగన్ కెరీర్ లో సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు…