ఆడియన్స్ ముందుకు డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకుని వచ్చిన లేటెస్ట్ మూవీ హీరో… కన్నడ డబ్ మూవీ అయిన ఈ సినిమా లో హీరో రిషబ్ శెట్టి…. డార్క్ కామెడీ నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమా కన్నడ లో రిలీజ్ అయ్యి మంచి పేరునే సొంతం చేసుకుంది. ఇక ఆహా వీడియోలో రీసెంట్ గా డైరెక్ట్ రిలీజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఇక్కడ ఎలా ఆకట్టుకుందో తెలుసుకుందాం పదండీ…
ముందుగా కథ పాయింట్ కి వస్తే… తను ప్రేమించిన అమ్మాయి కొన్ని కారణాల వలన విడిపోగా ఆమె గురించే ఆలోచిస్తూ తాగుడుకి అలవాటు పడ్డ హీరో కొన్నేళ్ళ తర్వాత కూడా తేరుకోలేక పోతాడు, దాంతో తనని వదిలేసిన హీరోయిన్ ని చంపడమే ధ్యేయం అనుకుంటాడు. హీరోయిన్ భర్త ఓ క్రూరమైన విలన్…
ఆ విలన్ కి కటింగ్ చేయడానికి హీరో ఆ విలన్ బంగ్లాకి వెళతాడు. అక్కడ కి వెళ్ళిన తర్వాత ఊహించని పరిణామాలు ఎదురు అవుతాయి. మరి హీరోయిన్ ని చంపాడా లేదా ఆ ఇంట్లో అసలు ఏం జరిగింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. కథ పాయింట్ చిన్నదే అయినా…
చాలా సింపుల్ గా ముగించేలానే ఉన్నా 2 గంటల వరకు సాగదీశారు అనిపిస్తుంది, సెకెండ్ ఆఫ్ లో ఇక కథ క్లైమాక్స్ కి వచ్చింది అనుకుంటే మళ్ళీ ట్విస్ట్ తో ఇంకా 20 నిమిషాలు పొడిగించారు. ఓవరాల్ గా ఫస్టాఫ్ వరకు బాగా ట్విస్ట్ లతో మెప్పించిన సినిమా సెకెండ్ ఆఫ్ కొంచం బోర్ కొడుతుంది. కానీ ఓవరాల్ గా డార్క్ కామెడీ మూవీ కాబట్టి…
ట్విస్ట్ లు చిన్న చిన్న కామెడీ ఎలిమెంట్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా కి ప్లస్ పాయింట్స్. లీడ్ పెయిర్ ఇద్దరూ ఆకట్టుకున్నారు. కొంచం లెంత్ తగ్గించి ఉంటే బాగుండేది. తెలుగు డబ్బింగ్ బాగానే సెట్ అయింది. ట్రైలర్ చూసి ఓ రేంజ్ థ్రిల్లర్ ని ఎక్స్ పెర్ట్ చేస్తే మట్టుకు కొంచం నిరాశ పడతారు. మొత్తం మీద ఎబో యావరేజ్ రేంజ్ మూవీ అని చెప్పొచ్చు.