Home న్యూస్ ఈగల్ మూవీ రివ్యూ…ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!

ఈగల్ మూవీ రివ్యూ…ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!

0

మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) లేటెస్ట్ మూవీ ఈగల్(Eagle Movie) ఆడియన్స్ ముందుకు మంచి అంచనాల నడుమ రిలీజ్ అయింది. బాక్ టు బాక్ 2 ఫ్లాఫ్స్ తర్వాత రవితేజ నుండి వస్తున్న ఈ సినిమా మీద ట్రైలర్ రిలీజ్ తర్వాత మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి సినిమా ఆ అంచనాలను ఎంతవరకు అందుకుందో లేదో తెలుసుకుందాం పదండీ…

ముందుగా స్టొరీ పాయింట్ విషయానికి వస్తే….తలకొన ఫారెస్ట్ ఏరియాలో ఒక కాటన్ మిల్ ని హీరో నడుపుతాడు…కానీ తనకి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, ఆ విషయం అనుపమ పరమేశ్వర్ ఎలా కనుక్కోవడానికి ట్రై చేసింది, ఇంతకీ హీరో ఫ్లాష్ బ్యాక్ ఏంటి….ఆ తర్వాత కథ ఏమయింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…

నార్మల్ స్టొరీ పాయింట్ తోనే వచ్చిన ఈ సినిమా అసలు పాయింట్ చెబితే మొత్తం రివీల్ అవుతుంది కాబట్టి బేసిక్ లైన్ చెబుతున్నాం… పెర్ఫార్మెన్స్ పరంగా రవితేజ డిఫెరెంట్ రోల్ లో అదరగొట్టేశాడు, తన డైలాగ్స్, స్క్రీన్ ప్రజెన్స్, మాస్ హీరోయిజం సీన్స్ అన్నీ కూడా బాగా ఎలివేట్ అయ్యాయి అని చెప్పాలి, క్యారెక్టర్ రోల్స్ సినిమాలో చాలా ఉండగా…

నవదీప్, అనుపమ, మధుబాల, అవసరాల శ్రీనివాస్ ఇలా అందరూ తమ తమ రోల్స్ లో ఉన్నంతలో బాగానే నటించారు, ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ లో చాలా నీరసంగా ఉంటుంది, టేక్ ఆఫ్ కి చాలానే టైం పట్టింది అని చెప్పాలి. కానీ వన్స్ టేక్ ఆఫ్ అయిన తర్వాత సినిమా మంచి జోరుతో సాగగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో లవ్ సీన్స్ తప్పితే…

మిగిలిన సీన్స్ అన్నీ కూడా బాగా ఆకట్టుకున్నాయి, డైలాగ్స్ చాలా బాగా రాసుకున్నారు, సినిమాటోగ్రఫీ టాప్ నాట్చ్ అనిపించేలా ఉండగా యాక్షన్ సీన్స్ ని అద్బుతంగా చూపించారు, ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ నాట్చ్ అనిపించేలా ఉన్నాయి. సంగీతం ఓకే అనిపించేలా ఉండగా బ్యాగ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్స్ లో మాత్రం ఎక్స్ లెంట్ గా ఆకట్టుకుంది….

ఇక డైరెక్షన్ విషయానికి వస్తే డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ చాలా నార్మల్ పాయింట్… అయినా కూడా చాలా స్టైలిష్ గా యాక్షన్ సీన్స్ ను, హీరోయిజం సీన్స్ ను మిక్స్ చేసి కొన్ని చోట్ల ఎమోషన్స్ ను బాగా పండేలా చేసుకుని మినిమమ్ గ్యారెంటీ ఔట్ పుట్ ఇచ్చాడు అని చెప్పొచ్చు, ఫస్టాఫ్ లో టేక్ ఆఫ్ కి ఎక్కువ టైం తీసుకోవడం కొందరికి బోర్ ఎక్కువగా అనిపించడం ఖాయం.

Raviteja Eagle Movie Review And Rating
అక్కడ మరింత శ్రద్ధ తీసుకుని అలాగే ఫ్లాష్ బ్యాక్ లో లవ్ స్టొరీకి మరింత టైట్ గా రాసుకుని ఉంటే సినిమా మరో లెవల్ లో ఉండేది… అయినా కానీ చాలా వరకు అంచనాలను అందుకున్న ఈగల్ మూవీ డైరక్టర్ గా కార్తీక్ కి మంచి పేరు తేవడం ఖాయం. మొత్తం మీద సినిమాలో రవితేజ సాలిడ్ పెర్ఫార్మెన్స్ అండ్ హీరోయిజం సీన్స్….

ఎక్స్ లెంట్ ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ హై లెవల్ యాక్షన్ సీన్స్, ఇంటర్వెల్, అండ్ ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ లు మేజర్ ప్లస్ పాయింట్స్ అయితే టేక్ ఆఫ్ కి టైం పట్టడం, స్టొరీ నార్మల్ గానే ఉండటం కొన్ని చోట్ల కన్ఫ్యూజన్ గా అనిపించడం లాంటివి డ్రా బ్యాక్స్ అని చెప్పొచ్చు…అయినా కూడా సినిమా ఎండ్ అయ్యే టైంకి ఆడియన్స్ ఫస్టాఫ్ బోర్ సీన్స్ ను మరిచిపోయి పర్వాలేదు బాగుంది అనిపించేలా బయటికి వస్తారు అని చెప్పొచ్చు…. ఓవరాల్ గా సినిమా కి మేం ఇస్తున్న రేటింగ్ 2.75 స్టార్స్…. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here