Home గాసిప్స్ భారీ రేట్లు పెట్టి కొన్న సినిమాల వల్ల కానిది ఏక్ మినీ కథ వల్ల అయిందట!!

భారీ రేట్లు పెట్టి కొన్న సినిమాల వల్ల కానిది ఏక్ మినీ కథ వల్ల అయిందట!!

0

పెద్ద సినిమాలకు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ రెస్పాన్స్ రావడం అన్నది కామన్, అదే టైం లో డిజిటల్ రిలీజ్ అయినా కూడా ఆ సినిమాల రేంజ్ ని బట్టి సాలిడ్ గా వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకునే రేంజ్ లో ఉంటాయి. కానీ చిన్న సినిమాల విషయం లో అలా ఉండదు, సినిమాలకు టాక్ బాగుంటే తప్పితే జనాలు థియేటర్స్ కి రావాలి అంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు…

ఇక డిజిటల్ లో డైరెక్ట్ రిలీజ్ ను సొంతం చేసుకున్న సినిమాల్లో కొన్ని మాత్రమే సాలిడ్ గా వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకున్నాయి. రీసెంట్ గా ఓ చిన్న సినిమా డిజిటల్ లో డైరెక్ట్ రిలీజ్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపే వ్యూస్ తో దూసుకు పోతుంది.

సంతోష్ శోభన్ హీరోగా యు వి క్రియేషన్ వాళ్ళు రూపొందించిన అడల్ట్ కంటెంట్ తో తెరకెక్కిన ఏక్ మినీ కథ సినిమా అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ రిలీజ్ ను సొంతం చేసుకోగా సినిమా కి సెన్సేషనల్ వ్యూవ్ వస్తున్నాయని సమాచారం. ప్రైమ్ వీడియో లో ఈ సినిమా కన్నా…

రేటు ఎక్కువ పెట్టి కొన్ని అనేక బాలీవుడ్ మూవీస్ అలాగే సౌత్ మూవీస్ రేంజ్ కి ఏమాత్రం తీసిపోని విధంగా ఈ సినిమా వ్యూవ్ వస్తున్నాయని అంటున్నారు. ఆల్ మోస్ట్ సినిమా పై పెట్టిన అమౌంట్ ని వీకెండ్ కే ప్రైమ్ వీడియో వాళ్ళకి రికవరీ అయ్యే రేంజ్ లో సినిమా ట్రెండ్ అవుతుందని, ఈ రేంజ్ వ్యూస్ ఎక్స్ పెర్ట్ చేయలేదని అంటున్నారు.

ఎంత వ్యూస్ అనేది ఇంకా రివీల్ చేయలేదు కానీ వీకెండ్ రిపోర్ట్స్ కొన్ని పెద్ద సినిమాల రేంజ్ లో ఉంటాయని అంటున్నారు. అంటే ఏ రేంజ్ లో సినిమా కి వ్యూవర్ షిప్ లభించిందో అర్ధం చేసుకోవచ్చు. ఈ లెక్కన సినిమా డిజిటల్ సూపర్ హిట్ అనిపించుకుంది అని చెప్పొచ్చు. స్టొరీ సబ్జెక్ట్ యూత్ కి నచ్చే విధంగా ఉండటం తో ఈ రేంజ్ వ్యూస్ వచ్చాయని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here