Home న్యూస్ బ్లాక్ బస్టర్ సీక్వెల్….ఫ్లాఫ్ టాక్…అయినా వీకెండ్ కుమ్ముందిగా!!

బ్లాక్ బస్టర్ సీక్వెల్….ఫ్లాఫ్ టాక్…అయినా వీకెండ్ కుమ్ముందిగా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర 8 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన ఏక్ విలన్ సినిమా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచి భారీ లాభాలను సొంతం చేసుకుంది దుమ్ము లేపిన తర్వాత ఆ సినిమా సీక్వెల్ ఏక్ విలన్ రిటర్న్స్ ని ఆడియన్స్ ముందుకు 8 ఏళ్ల తర్వాత రీసెంట్ గా రిలీజ్ చేశారు… కాగా మొదటి పార్ట్ తో పోల్చితే ఈ సీక్వెల్ సినిమా కి మొదటి ఆటకే ఫ్లాఫ్ టాక్ సొంతం చేసుకుంది.

దాంతో సినిమా ఇక తేరుకునే అవకాశం లేదని అంతా అనుకున్నారు… మొదటి రోజు కలెక్షన్స్ పరంగా కూడా సినిమా 7 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోగా వీకెండ్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో అన్న డౌట్స్ నెలకొన్న టైం లో….

సినిమా వీకెండ్ లో టాక్ కి అతీతంగా మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితులను గమనించి చెప్పాలి అంటే… సినిమా మొత్తం మీద ఫస్ట్ డే 7.05 కోట్లు, రెండో రోజు 7.47 కోట్లు వసూల్ చేయగా మూడో రోజు 9.02 కోట్ల షేర్ ని అందుకుంది.

దాంతో మూడు రోజుల వీకెండ్ లో సినిమా 23.54 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుంది. ఇక వర్కింగ్ డేస్ లో హోల్డ్ చేస్తే సినిమా ఉన్నంతలో ఫ్లాఫ్ టాక్ తో డీసెంట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉంది. మొత్తం మీద ఫ్లాఫ్ టాక్ తో వీకెండ్ వరకు బాగానే హోల్డ్ చేసిన సినిమా లాంగ్ రన్ లో ఎలా హోల్డ్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here