బాక్స్ ఆఫీస్ దగ్గర మలయాళ సినిమా ఇండస్ట్రీ తరుపున భారీ హైప్ తో రూపొందిన సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohan Lal) నటించిన లూసిఫర్(Lucifer Movie) సీక్వెల్ అయిన L2E – లూసిఫర్2(ఎంపురాన్)(Lucifer 2 – Empuraan) సినిమా, క్రేజ్ ఏమాత్రం తీసిపోని రేంజ్ లో వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ పరంగా…
మాస్ ఊచకోత కోసి సంచలనం సృష్టించింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి జోరుని చూపించినా కూడా టాక్ కొంచం ఇక్కడ మిక్సుడ్ గా ఉన్నప్పటికీ మేజర్ సెంటర్స్ లో మంచి జోరు నే చూపించగా ఓవరాల్ గా ఇక్కడ 1.6-2 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉండగా…
ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు కనుక బాగుంటే మొదటి రోజు కలెక్షన్స్ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక కేరళలో సినిమా మొదటి రోజున ఇప్పుడు 13-15 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ తో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయబోతూ ఉండగా… కర్ణాటకలో కూడా ఇప్పటి వరకు….
ఏ మలయాళ సినిమా సాధించని రేంజ్ లో 4.5 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను అందుకోబోతూ ఉండగా తమిళనాడు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కూడా డీసెంట్ జోరు ని చూపెడుతున్న ఉన్న ఓవరాల్ గా మొదటి రోజున ఇండియా లో ఓవరాల్ గా ఇప్పుడు…
23-25 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉండగా ఓవర్సీస్ లో ఊహకందని రాంపెజ్ ను చూపెడుతూ దూసుకు పోతున్న సినిమా 4 మిలియన్ డాలర్స్ మార్క్ కి అటూ ఇటూగా ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉండటంతో…
మొత్తం మీద వరల్డ్ వైడ్ గా మొదటి రోజున సినిమా 58-60 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఫైనల్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉంది. ఇక డే 1 అఫీషియల్ కలెక్షన్స్ ఈ అంచనాలను ఎంతవరకు మించిపోతాయో చూడాలి ఇప్పుడు.