మలయాళ సినిమా అంటే తక్కువ బడ్జెట్ సినిమాలనే ఎక్స్ లెంట్ క్వాలిటీ తో తీసి ఇతర ఇండస్ట్రీల భారీ బడ్జెట్ మూవీస్ ని సైతం తలదన్నేలా రూపొందించే ఇండస్ట్రీ అన్న పేరు ఉంటుంది…ఇతర ఇండస్ట్రీలతో పోల్చితే తక్కువ బడ్జెట్ తోనే ఎక్స్ లెంట్ క్వాలిటీతో సినిమాలు తీసే మలయాళ ఇండస్ట్రీ నుండి ఇప్పుడు…
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohan Lal) నటించిన లూసిఫర్(Lucifer Movie) సీక్వెల్ అయిన L2E – లూసిఫర్2(ఎంపురాన్)(Lucifer 2 – Empuraan) సినిమా పాన్ ఇండియా రేంజ్ లో సాలిడ్ క్రేజ్ నడుమ రిలీజ్ కాబోతూ ఉండగా సినిమా మీద అన్ని చోట్లా…
ఎక్స్ లెంట్ బజ్ అండ్ క్రేజ్ ఉంది. దాంతో టాక్ మినిమమ్ వచ్చినా కూడా మలయాళ ఇండస్ట్రీ రికార్డుల బెండు తీసే అవకాశం ఉన్న ఈ సినిమా ఓవరాల్ గా ఎంత బడ్జెట్ తో రూపొందింది అన్నది ఇప్పుడు అన్ని ఇండస్ట్రీలలో కూడా మోస్ట్ వాంటెడ్ ప్రశ్న అని చెప్పాలి.
సహజంగా ఇలాంటి పెద్ద సినిమాలు వచ్చినప్పుడు ప్రెస్ మీట్ లో మాస్ సినిమాకి ఇంత బడ్జెట్ అయ్యింది అంటూ మేకర్స్ చెబుతారు. కానీ ఈ సినిమా విషయంలో ఇటు డైరెక్టర్ గా ప్రుద్వీరాజ్ కానీ అటు హీరోగా చేసిన మోహన్ లాల్ కానీ…
ఒక్క పైసా కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండా సినిమాను కంప్లీట్ చేశారట. దాంతో కేవలం ప్రొడక్షన్ కాస్ట్ అటూ ఇటూగా 75-80 కోట్ల రేంజ్ లో అయిందని మలయాళ ఇండస్ట్రీలో టాక్ ఉంది. ఇక రెమ్యునరేషన్ లు పెర్సంటేజ్ లో ఉంటుందని అంటూ ఉండగా…
అవన్నీ కలిపి అటూ ఇటూగా 130-150 కోట్ల రేంజ్ లో సినిమా అయిందని టాక్ ఉంది. ఓవరాల్ గా మలయాళ ఇండస్ట్రీ తరుపున వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బడ్జెట్ తో రూపొందిన ఎంపురాన్ మూవీ ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ బడ్జెట్ ను అవలీలగా రికవరీ చేసే అవకాశం ఎంతైనా ఉందని అంచనా వేస్తున్నారు. మరి అది ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి.