బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాల నడుమ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohan Lal) నటించిన లూసిఫర్(Lucifer Movie) సీక్వెల్ అయిన L2E – లూసిఫర్2(ఎంపురాన్)(Lucifer 2 – Empuraan) సినిమా రిలీజ్ అవ్వగా ముందుగా ప్రీమియర్స్ ను పూర్తి చేసుకుని పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను…
సొంతం చేసుకోగా ఇప్పుడు రెగ్యులర్ షోలకు ఫైనల్ గా ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుందో తెలుసుకుందాం పదండీ… ముందుగా కథ పాయింట్ కి వస్తే లూసిఫర్ ఎండ్ అయిన ఎపిసోడ్ నుండే మొదలు అయ్యే ఎంపురాన్ మూవీ ఫ్లాష్ బ్యాక్ కోణంతో ఓపెన్ అయ్యి…
తర్వాత ప్రజెంట్ టైం కి వస్తుంది…రాష్ట్రం కష్టాల్లో ఉందని తెలిసిన లూసిఫర్ తిరిగి వచ్చి ఏం చేశాడు…తన శత్రువులను ఎలా ఎదిరించాడు అన్నది మొత్తం మీద కథ పాయింట్… మొదటి పార్ట్ మాదిరిగానే రెండో పార్ట్ లో బేసిక్ కథ పాయింట్ సేం అయినా కూడా టేకింగ్ పరంగా…
అల్ట్రా స్టైలిష్ విజువల్స్ తో మెప్పించగా ప్రొడక్షన్ వాల్యూస్ ఓ రేంజ్ లో ఆకట్టుకుంటాయి…కానీ స్క్రీన్ ప్లే పరంగా మాత్రం మొదటి పార్ట్ మాదిరిగానే స్లో నరేషన్ తో సాగే సినిమా మలయాళ ఆడియన్స్ కి టేస్ట్ కి బాగానే నచ్చవచ్చు కానీ మన ఆడియన్స్ కి బోర్ ఫీల్ అవ్వడం ఖాయం…
మోహన్ లాల్ ఎంట్రీనే ఆల్ మోస్ట్ గంట తర్వాత అవుతుంది కానీ ఆ సీన్ చాలా బాగా వచ్చింది, కానీ చాలా చోట్ల ఆ రోల్ కి ఎలివేషన్ లు పడగా మోహన్ లాల్ స్క్రీన్ ప్రజెన్స్, డైలాగ్స్, హీరోయిజం సీన్స్ ఎక్స్ లెంట్ గా సెట్ అయ్యాయి, ముఖ్యంగా సెకెండ్ ఆఫ్ లో ఫారెస్ట్ ఫైట్ హైలెట్ గా నిలిచింది…
ఇక పృద్వీరాజ్ కనిపించిన కొద్ది సేపు అదరగొట్టేశాడు. ఇక మిగిలిన స్టార్ కాస్ట్ చాలా పెద్దదిగా ఉండగా అందరూ పర్వాలేదు అనిపించారు… బ్యాగ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్స్ ని బాగా ఎలివేట్ చేసినా ఓవరాల్ గా ఓకే అనిపించింది…స్క్రీన్ ప్లే ఎడిటింగ్ ముందే చెప్పినట్లు మలయాళ ఆడియన్స్ కి బాగానే…
అనిపించవచ్చు కానీ మనకు అది చాలా వరకు స్లో నరేషన్ తో బోర్ ఫీల్ అయ్యేలా చేసింది. ఫస్టాఫ్ టేక్ ఆఫ్ కి టైం పట్టగా ఉన్నంతలో మోహన్ లాల్ ఎంట్రీ నుండి ఊపు అందుకోగా సెకెండ్ ఆఫ్ లో కొన్ని మేజర్ హైలెట్ సీన్స్ పడటంతో పడుతూ లేస్తూ సాగినా కానీ రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్…
ఎక్స్ లెంట్ సినిమాటోగ్రఫీ మరియు మోహన్ లాల్ మెస్మరైజింగ్ స్క్రీన్ ప్రజెన్స్ వలన మరీ బోర్ అని అనిపించలేదు కానీ హైప్ ను ఫుల్లుగా వాడుకోలేక పోయారు అనిపించింది….సినిమాలో అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ కూడా లెంత్ ఒక్కటి తగ్గించి ఉంటే…
ఈజీగా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసే విధంగా సినిమా ఉండేది, కానీ 3 గంటల లెంత్ ఉన్న ఎంపురాన్ ని చూడాలి అంటే తెలుగు ఆడియన్స్ వరకు కొంచం ఎక్కువ ఓపిక చేసుకుంటే కొంచం బోర్ అనిపించినా కొన్ని సీన్స్ బాగా ఉండటంతో ఓవరాల్ గా సినిమా అయ్యే టైంకి…
యావరేజ్ టు ఎబో యావరేజ్ లెవల్ లో అనిపించవచ్చు సినిమా…మరీ హైప్ ని దృష్టిలో పెట్టుకుని వెళితే మట్టుకు కొంచం బోర్ అనిపిస్తుంది సినిమా…కానీ టేకింగ్ అండ్ విజువల్స్ కోసం, కొన్ని ఎక్స్ లెంట్ సీన్స్ కోసం ఓపిక పట్టి చూడొచ్చు… ఓవరాల్ గా సినిమాకి మా రేటింగ్ 2.75 స్టార్స్…