బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాల నడుమ ఈ నెల ఎండ్ లో సమ్మర్ కానుకగా గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధం అవుతున్న మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohan Lal) నటించిన లూసిఫర్(Lucifer Movie) సీక్వెల్ అయిన L2E – లూసిఫర్2(ఎంపురాన్)(Lucifer 2 – Empuraan) సినిమా మీద అంచనాలు మరో లెవల్ లో ఉండగా…
సినిమా ట్రైలర్ రిలీజ్ తర్వాత అంచనాలు మరో లెవల్ కి పెరిగి పోయాయి. దాంతో ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా భారీ రికార్డులతో విరుచుకుపడటం ఖాయమని అందరూ అనుకుంటూ ఉండగా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ లెక్కలు ఇండియాకి కాను కేరళ అలాగే…
ఇతర మేజర్ సెంటర్స్ లో ఓపెన్ అవ్వగా ఊహకందని రేంజ్ లో టికెట్ సేల్స్ తో మాస్ భీభత్సం సృష్టించింది….ఇండియన్ మూవీస్ పరంగా ప్రీ బుకింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఆల్ టైం రికార్డ్ బుకింగ్స్ ను సొంతం చేసుకుని ఎంపురాన్ మూవీ సరికొత్త రికార్డ్ ను నమోదు చేసింది.
ఇది వరకు లియో మూవీ ప్రీ బుకింగ్స్ లో ఒక గంటలో 82 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను అందుకోగా…పాన్ ఇండియా బిగ్గెస్ట్ మూవీ పుష్ప2 మూవీ ప్రీ బుకింగ్స్ రిపోర్ట్ ఒక గంటలో 80 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను అందుకోగా….ఇప్పుడు వీటి రికార్డులను బ్రేక్ చేసిన…
ఎంపురాన్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ను ఓపెన్ చేసిన వెంటనే ఏకంగా ఒక గంటలో 96 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని ఊహకందని ఊచకోత కోసింది. దాంతో సినిమా మీద ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో చెప్పకనే చెప్పిన ఈ సినిమా ఇక…
ఇదే రేంజ్ లో ట్రెండ్ ను కనుక కొనసాగిస్తే ఓపెనింగ్స్ పరంగా పాన్ ఇండియా మూవీస్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను మొదటి రోజు అందుకోవడం ఖాయమని చెప్పాలి. ఇక కేరళలో సైతం సినిమా రికార్డ్ లెవల్ లో ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.