Home న్యూస్ లూసిఫర్2 ఎంపురాన్ ప్రీమియర్స్ షో రివ్యూ….హిట్టా-ఫట్టా!!

లూసిఫర్2 ఎంపురాన్ ప్రీమియర్స్ షో రివ్యూ….హిట్టా-ఫట్టా!!

0

వరల్డ్ వైడ్ గా సాలిడ్ అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohan Lal) నటించిన లూసిఫర్(Lucifer Movie) సీక్వెల్ అయిన L2E – లూసిఫర్2(ఎంపురాన్)(Lucifer 2 – Empuraan) సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయింది. సినిమా మీద ఉన్న అంచనాలు మరో లెవల్ లో ఉండగా….

మలయాళ సినిమాల పరంగా ఆల్ టైం రికార్డ్ బిజినెస్ ను, రికార్డ్ లెవల్ బుకింగ్స్ తో మాస్ ఊచకోత కోసిన ఈ సినిమా ముందుగా ప్రీమియర్స్ ను పూర్తి చేసుకోగా మొదటి టాక్ బయటికి వచ్చేసింది. మొత్తం మీద ఇనీషియల్ టాక్ అయితే బాగానే ఉందని చెప్పాలి ఇప్పుడు.

స్టోరీ పాయింట్ ను పూర్తిగా రివీల్ చేయడం లేదు కానీ లూసిఫర్ ఎండ్ అయిన చోటే మొదలు అయ్యి ఎంపురాన్ మూవీ అసలు లూసిఫర్ బ్యాగ్రౌండ్ ఏంటి….అతను ఎంత పవర్ ఫుల్ వ్యక్తి అనేది చెబుతూ తన ఫ్లాష్ బ్యాక్ ను రివీల్ చేస్తారు…ఈ క్రమంలో రాష్ట్రం మళ్ళీ కష్టాల్లో ఉందీ అని తెలుసుకున్న హీరో తిరిగి వచ్చి ఏం చేశాడు అన్నది…

సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…కథ పాయింట్ లో అనేక ఇతర కథలు ఉండగా అవన్నీ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…. సినిమా కొంచం స్లో నరేషన్ తో సాగినా హీరో పెద్దగా కనిపించకున్నా కూడా ఆద్యంతం కూడా ఒక హై మెయిన్ టైన్ చేస్తూ హీరో ఎలివేషన్ సీన్స్ తో నిండిపోతూ ఫస్టాఫ్ వరకు…

కథ టేక్ ఆఫ్ అయిన తర్వాత ఇంటర్వల్ వరకు నాన్ స్టాప్ గా స్క్రీన్ ప్లే మెప్పించగా…సెకెండ్ ఆఫ్ పై అంచనాలు పెరిగిన తర్వాత సెకెండ్ ఆఫ్ కొంచం పడుతూ లేస్తూ సాగినా కూడా మళ్ళీ ప్రీ క్లైమాక్స్ నుండి జోరు చూపించడంతో సెకెండ్ ఆఫ్ ఎబో యావరేజ్ లెవల్ లో అనిపించింది.

మోహన్ లాల్ హీరోయిజం సీన్స్, పృద్వీరాజ్ ఎలివేషన్ లు అలాగ్ డైరెక్షన్ హైలెట్ గా నిలవగా లూసిఫర్ కి ఏమాత్రం తీసిపోని విధంగా లూసిఫర్2 ఉందని చెప్పొచ్చు. కానీ లెంత్ మాత్రం కొంచం ఎక్కువ అయిన ఫీలింగ్ కలిగిందని… లెంత్ కొంచం టైట్ గా ఉండి ఉంటే…

సినిమా రేంజ్ ఇంకో లెవల్ లో ఉండేదని అంటున్నారు. ఓవరాల్ గా లూసిఫర్2 మూవీ ఫస్టాఫ్ యావరేజ్ టు ఎబో యావరేజ్ అనిపించే రేంజ్ లో సెకెండ్ ఆఫ్ ఎబో యావరేజ్ లెవల్ లో ఓవరాల్ గా హిట్ లెవల్ లో ఉందని టాక్ అయితే ప్రీమియర్స్ నుండి వినిపిస్తూ ఉండటంతో రెగ్యులర్ షోలకు ఇదే రేంజ్ లో టాక్ వస్తే ఇక మాస్ రచ్చ ఖాయమని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here