ఈ సమ్మర్ స్టార్టింగ్ లో వరల్డ్ వైడ్ గా మంచి అంచనాల నడుమ రిలీజ్ కి సిద్ధం అయిన మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohan Lal) నటించిన లూసిఫర్(Lucifer Movie) సీక్వెల్ అయిన L2E – లూసిఫర్2(ఎంపురాన్)(Lucifer 2 – Empuraan) సినిమా మీద అంచనాలు ఓ రేంజ్ లో ఉండగా…అడ్వాన్స్ బుకింగ్స్ తోనే….
ఈ సినిమా అన్ని చోట్లా ఊరమాస్ జాతర సృష్టిస్తూ ఉండగా మలయాళ మూవీస్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బిజినెస్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది ఈ సినిమా… ఓవరాల్ గా ఓవర్సీస్ లోనే ఏకంగా 30 కోట్ల రేంజ్ లో వాల్యూ ప్రీ రిలీజ్ బిజినెస్ ను..
సొంతం చేసుకోగా…తెలుగు రాష్ట్రాలలో 5.50 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను అందుకుంది. ఇక కేరళ కర్ణాటక, తమిళ్ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద ఓవరాల్ గా సినిమా వాల్యూ బిజినెస్ రేంజ్ 65 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంచనా…
దాంతో టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా వాల్యూ బిజినెస్ రేంజ్ ఆల్ మోస్ట్ 100 కోట్ల మార్క్ రేంజ్ లో ఉంటుందని సమాచారం. మలయాళ సినిమాల పరంగా ఇది ఆల్ టైం బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ అని చెప్పొచ్చు. దాంతో సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా…
నిలవాలి అంటే మినిమమ్ 225 కోట్ల రేంజ్ కి ఏమాత్రం తీసిపోని గ్రాస్ కలెక్షన్స్ ని అందుకోవాల్సి ఉంటుంది వరల్డ్ వైడ్…సినిమా మీద ఉన్న హైప్ దృశ్యా ఏమాత్రం టాక్ పాజిటివ్ గా ఉన్నా కూడా అవలీలగా ఈ టార్గెట్ ను సినిమా అందుకోవడం ఖాయమని చెప్పాలి.