Home న్యూస్ 45 లక్షలతో 16.8 కోట్లు….ఎపిక్ బ్లాక్ బస్టర్ సీక్వెల్!!

45 లక్షలతో 16.8 కోట్లు….ఎపిక్ బ్లాక్ బస్టర్ సీక్వెల్!!

1026
0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎప్పుడు ఏ సినిమాలు ఎలాంటి రిజల్ట్ ని సొంతం చేసుకుంటాయో చెప్పలేం, అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ విజయాన్ని నమోదు చేసిన సినిమాలు ఎన్నో ఉన్నాయి, కానీ తమిళ్ నుండి తెలుగు లో డబ్ అయ్యి అసలు ఎవ్వరూ పట్టించుకొని సినిమా పాజిటివ్ టాక్ పవర్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎవ్వరి ఊహకలకు అందని కలెక్షన్స్ ని అందుకుంది.

Tollywood Actors Top Anniversary Trends

ఆ సినిమా నే బిచ్చగాడు… విజయ్ అంటోని నటించిన ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఇదేమి టైటిల్ రా బాబు ఎవరో చూస్తారు ఈ సినిమా ని అని అనుకోని వారు లేరు, కానీ పాజిటివ్ టాక్ పవర్ తో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ లో అద్బుతాలు నమోదు చేసింది.

సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్ కేవలం 45 లక్షలకు పలకగా ఇక్కడ మరో 20 లక్షలతో కొన్న నిర్మాత పబ్లిసిటీ చేశాడు, బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని రెస్పాన్స్ ని సొంతం చేసుకుని ఫ్యామిలీ ఆడియన్స్ విరగబడి థియేటర్స్ కి రావడం తో సినిమా ఏకంగా 16.8 కోట్ల షేర్ ని లాంగ్ రన్ లో అందుకుంది.

అలాంటి సెన్సేషనల్ మూవీ కి ఇప్పుడు సీక్వెల్ సిద్ధం అవుతుంది, ఆ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ సీక్వెల్ స్క్రిప్ట్ ని ఆల్ మోస్ట్ సిద్ధం చేశారని సమాచారం… ఆల్ మోస్ట్ సేం కాస్ట్ తో సినిమా ఉంటుందని అంటున్నారు. తెలుగు లో ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుందో తమిళ్ లో కూడా అదే రేంజ్ విజయాన్ని అందుకున్న ఈ సినిమా…

తమిళ్ లో హైయెస్ట్ టి.ఆర్.పి రేటింగ్ ని అందుకున్న సినిమా గా 27 రేటింగ్ పాయింట్స్ తో దుమ్ము లేపింది, తెలుగు లో కూడా 18.6 రేటింగ్ తో బుల్లి తెరపై కూడా అల్టిమేట్ విజయాన్ని నమోదు చేసుకుంది, ఇలాంటి సినిమా కి సీక్వెల్ అంటే కచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపడం ఖాయమని చెప్పొచ్చు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here