Home న్యూస్ ఇటర్నల్స్ మూవీ టాక్ ఏంటి…2 డేస్ కలెక్షన్స్!!

ఇటర్నల్స్ మూవీ టాక్ ఏంటి…2 డేస్ కలెక్షన్స్!!

1678
0

అవెంజర్స్ తర్వాత మార్వేల్ నుండి మొదలైన కొత్త సినిమా ఇటర్నల్స్…అవెంజర్స్ రేంజ్ లో కాకున్నా ట్రైలర్ ఆకట్టుకోవడంతో ఈ సినిమా పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి, ఇక సినిమా దీపావళి కానుకగా ఇండియాలో గ్రాండ్ రిలీజ్ నే సొంతం చేసుకుంది, మరి సినిమా ఎలా ఉంది, హైప్ కి తగ్గట్లు ఆకట్టుకుందా లేదా అన్న వివరాలను ఒకసారి గమనిస్తే.. ముందుగా కథ పాయింట్ కి వస్తే ఒలింపియా గ్రహంలో అరేశం అనే సెలెస్టియల్….

ఇటర్నల్స్ ని క్రియేట్ చేస్తాడు…. వాళ్ళు భూమిని అక్కడున్న మానవాళిని నాశనం చేయాలనీ వచ్చిన డీవియంట్స్ ని ఆపడానికి భూమి మీదకి రాగా ఇక్కడే 7000 ఏళ్ళు అవుతున్నా అన్ని డీవియంట్స్ ని అంతం చేసినా అరేశం వాళ్ళని తిరిగి పిలవడు…. దానికి ఒక కారణం ఉంటుంది….

మానవాళితో కలిసి పోయిన ఇటర్నల్స్ అరేశం గురించిన ఓ నిజం తెలుసుకుంటారు… తర్వాత ఏం జరిగింది అన్నది మెయిన్ కథ… కథ పాయింట్ నావెల్ గా ఉన్నా కానీ మార్వెల్ మూవీస్ లో ఉండే కమర్షియల్ టచ్ ఇటర్నల్స్ లో కంప్లీట్ గా మిస్ అయ్యి DC మూవీస్ లో ఉండేలా డార్క్ సీన్స్ ఎక్కువ అయిపోవడంతో…

సినిమా నత్తనడకన సాగుతుంది, వీళ్ళు పేరుకు సూపర్ హీరోస్ అంటారు కానీ వాళ్ళు పెద్దగా పోరాటాలు చేయడం ఏమి చూపట్టలేదు, ఒకటి రెండు యాక్షన్ సీన్స్ మినహా సినిమా చాలా స్లోగా సాగుతూ క్లైమాక్స్ కూడా మరీ అంత ఆకట్టుకోదు, కానీ విజువల్స్ అండ్ గ్రాఫిక్స్ మాత్రం మరో లెవల్ లో ఉన్నాయని చెప్పాలి… ఎలాంటి వంక పెట్టడానికి ఛాన్స్ లేని గ్రాండియర్…

ఎంత బాగా ఆకట్టుకున్నా కథ చాలా బోరింగ్ గా సాగి నీరసం తెప్పిస్తుంది… మొత్తం మీద చూసుకుంటే అవెంజర్స్ అండ్ ఇతర మార్వేల్ మూవీస్ చూసి ఈ సినిమా కూడా ఆ రేంజ్ లో ఉంటుంది అనుకుంటే కచ్చితంగా నిరాశ చెందటం ఖాయం, జస్ట్ యావరేజ్ అనిపించే సినిమా ఇది, ఇక ఇండియాలో ఫస్ట్ డే 7.6 కోట్లు, రెండో రోజు 7 కోట్ల నెట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతుంది ఈ సినిమా…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here