3.5 వస్తే రంగస్థలం ఔట్..భీభత్సం ఇది!

    సంక్రాంతి రేసు లో చివరగా ఎంటర్ అయినా బాక్స్ ఆఫీస్ దగ్గర భీభత్సమైన కలెక్షన్స్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేస్తూ దూసుకు పోతున్న విక్టరీ వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ ల ఎఫ్ 2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ ఇప్పుడు తెలుగు సినిమా చరిత్రలో ఆల్ టైం నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన రంగస్థలం ప్లేస్ ని దక్కించు కో బోతుంది. టోటల్ షేర్ ని దాటి కాదు…

సినిమా ఓవరాల్ గా సాధించిన లాభాల విషయం లో… టాలీవుడ్ చరిత్రలో బాహుబలి ని తప్పితే మిగిలిన సినిమాలలో బిజినెస్ కి ఎన్నో రెట్లు వసూళ్లు సాధించిన సినిమాల విషయం లో విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం 15 కోట్ల బిజినెస్ కి 70 కోట్ల షేర్ తో..

ఏకంగా 55 కోట్ల ప్రాఫిట్ తో మొదటి ప్లేస్ లో ఉంది, ఇక రెండో ప్లేస్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం 80 కోట్ల బిజినెస్ కి ఏకంగా 127.5 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని 47.5 కోట్ల ప్రాఫిట్ ని సొంతం చేసుకుని టాప్ 2 ప్లేస్ ని దక్కించుకుని సత్తా చాటింది.

ఇక ఇప్పుడు ఎఫ్ 2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 78.6 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇప్పటికే సాధించగా 34.5 కోట్ల బిజినెస్ కి ఏకంగా 44.1 కోట్ల లాభాన్ని సొంతం చేసుకుని ఆల్ టైం మూడో బిగ్గెస్ట్ ప్రాఫిట్ ని సొంతం చేసుకున్న తెలుగు సినిమాగా నిలిచింది.

ఫైనల్ రన్ లో ఎఫ్ 2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ సినిమా మరో 3.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే రంగస్థలం ప్లేస్ లోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంది, ఒకవేళ అది మిస్ అయినా ఇప్పటికే సినిమా మూడో ప్లేస్ తో భీభత్సం సృష్టించింది. మరి ఫైనల్ రన్ లో ఈ మార్క్ ని అందుకుంటుందో లేదో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

Related Articles

Post A Comment

avatar
  Subscribe  
Notify of

FOLLOW US ON

Facebook
Twitter

SEARCH THIS SITE

SHARE THIS ARTICLE