బిజినెస్ మారింది, ఆశ పెరిగింది…ఇక కుమ్ముడేనా??

0
665

  విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ ల కాంబినేషన్ లో భారీ ఎత్తున రూపొందిన మల్టీ స్టారర్ మూవీ F2 బాక్స్ ఆఫీస్ దగ్గర మరికొన్ని గంటల్లో రిలీజ్ కానుండగా ఈ సినిమా పై మంచి హైప్ నెలకొన్న కారణంగా బిజినెస్ ముందుగా 45 కోట్ల రేంజ్ లో జరగగా ఇప్పుడు బిజినెస్ లో మార్పులు జరిగాయి. ప్రస్తుతం నెలకొన్న క్లాష్ దృశ్యా అంత బిజినెస్ మంచిది కాదు అని మీటింగ్స్ జరగడంతో కొత్త బిజినెస్ రిలీజ్ చేశారు.

ఆ బిజినెస్ పరకారం… నైజాం: 9 cr, సీడెడ్: 5 cr, ఆంధ్ర: 14 cr, టోటల్: రూ. 28 cr (ఏపీ+ తెలంగాణా), రెస్ట్ ఆఫ్ ఇండియా: 2.25, ఓవర్సీస్: 4.25, వరల్డ్ వైడ్ టోటల్: రూ. 34.50 cr. అంటే ఇప్పుడు సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడానికి 35.5 కోట్లు వసూల్ చేస్తే సరిపోతుంది.

సంక్రాంతి అంటే టోటల్ ఫ్యామిలీ ఎంజాయ్ చేసే సినిమాలకు భారీ అవకాశం ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాల కన్నా ఈ సినిమా కి ఎక్కువ అవకాశం ఉందని చెప్పాలి, ఇక అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జోరు అందుకున్న నేపధ్యంలో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కుమ్మేసే అవకాశం అయితే ఎక్కువగా ఉందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!