Home న్యూస్ ఫలక్ నుమా దాస్ ప్రీమియర్ షో రివ్యూ…హిట్టా-ఫట్టా!!

ఫలక్ నుమా దాస్ ప్రీమియర్ షో రివ్యూ…హిట్టా-ఫట్టా!!

499
0

    

చిన్న సినిమాల్లో రీసెంట్ టైం లో మంచి బజ్ ని సొంతం చేసుకున్న సినిమా ఫలక్ నుమా దాస్.. టీసర్ ట్రైలర్ ఆకట్టుకోవడం తో సినిమా నేడు భారీ ఎత్తున రిలీజ్ అయింది, కాగా సినిమా ముందుగా రెండు రాష్ట్రాలలో సెలెక్టెడ్ ఏరియాలలో అలాగే ఓవర్సీస్ లో ప్రీమియర్ షోల ను పూర్తీ చేసుకోగా అక్కడ నుండి ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుందో తెలుసు కుందాం పడండ… ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే…

హైదరాబాదు ఫలక్ నుమా లో ఉండే కుర్రాళ్ళు గ్యాంగ్ ని మెయిన్ టైన్ చేస్తూ గ్యాంగ్ స్టర్స్ అవ్వాలని చూస్తారు, అనుకోకుండా ఒక పోలిస్ కేస్ లో ఇరుక్కోవడం తో వీరి లైఫ్ టర్న్ తీసుకుంటుంది, ఆ కేస్ ఏంటి వీరి లైఫ్ ఎలా టర్న్ తీసుకుంది అన్నది స్టొరీ పాయింట్ అంటున్నారు.

కథ పాయింట్ ఎంత సింపుల్ గా మొదటి అర్ధభాగం వరకు పక్కా లోకల్ ఫీలింగ్ తో కథ ఆసక్తిగానే సాగుతుందని, మంచి పాయింట్ తో ఇంటర్వెల్ బ్యాంగ్ పడగా సెకెండ్ ఆఫ్ మరింత బాగుంటుంది అనుకున్నా సెకెండ్ ఆఫ్ స్లో డౌన్ అవుతూ ట్రాక్ తప్పుతూ ఉంటుందని అంటున్నారు.

హీరోయిన్స్ ఇద్దరు జస్ట్ ఒకే అనిపించుకోగా తరుణ్ భాస్కర్ బాగా నటించాడని విశ్వక్ సేన్ ఫుల్ మార్కులు కొట్టేశాడని అంటున్నారు, ఓవరాల్ గా కథ వీక్ గా ఉండటం సినిమాకి మేజర్ డ్రా బ్యాక్ అని, సంగీతం సోసో గా ఉన్నా బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరి పోయిందని అంటున్నారు.

మొత్తం మీద సినిమా ఎలా ఉంది అంటే జస్ట్ ఒకే ఎబో యావరేజ్ గా అనిపించింది, పక్కా మాస్ లోకల్ మూవీస్ ఇష్టపడే వారికి నచ్చుతుంది అని అంటున్నారు. ఫైనల్ గా సినిమా కి స్పెషల్ షోలు, ఓవర్శిస్ ప్రీమియర్ షోల నుండి యావరేజ్ టు ఎబో యావరేజ్ రేంజ్ టాక్ లభించింది అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!