బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ తరుపునే కాకుండా ఆల్ ఓవర్ ఇండియా వైడ్ గా కూడా రికార్డుల జాతర సృష్టిస్తూ మాస్ రచ్చ చేస్తున్న అల్లు అర్జున్(Allu Arjun) నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప2(Pushpa 2 The Rule) రికార్డుల జాతర మొదటి వారంలో అందరి అంచనాలను ఓ రేంజ్ లో మించి పోయి మాస్ ఊచకోత కోసింది.
ఇండియన్ మూవీస్ పరంగా ఫాస్టెస్ట్ 1000 కోట్ల మార్క్ ని అందుకుని ఆల్ టైం రికార్డ్ ను నమోదు చేసింది….కాగా టాలీవుడ్ తరుపున నాలుగో 1000 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకున్న సినిమాగా నిలిచిన పుష్ప2 మూవీ మిగిలిన సినిమాల రికార్డులను ఓ రేంజ్ లీడ్ తో బ్రేక్ చేసింది…
ఓవరాల్ గా టాలీవుడ్ సినిమాలు 1000 కోట్ల మార్క్ ని అందుకున్న రోజులను గమనిస్తే…ప్రభాస్ నటించిన కల్కి మూవీ 24 రోజుల టైంకి బాక్స్ ఆఫీస్ దగ్గర 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుంది…ఇక ఎన్టీఆర్ రామ్ చరణ్ ల ఆర్ ఆర్ ఆర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర….
16 రోజుల టైంకి ఓవరాల్ గా 1000 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని కుమ్మేసింది….కానీ ఇండియన్ మూవీస్ లో ఎవ్వరూ టచ్ చేయలేరు ఏమి అనుకున్న బాహుబలి2 మూవీ 2017 టైంలోనే ఏకంగా 10 రోజుల గ్యాప్ లో ఏకంగా 1000 కోట్ల మార్క్ ని అందుకుంది…
అంటే యావరేజ్ గా రోజుకి 100 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకుని మాస్ ఊచకోత కోసింది….కానీ ఇప్పుడు కేవలం వారం రోజుల టైంకే పుష్ప2 మూవీ 1000 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని సంచలన రికార్డ్ ను సృష్టించి కొత్త బెంచ్ మార్క్ ని అప్ కమింగ్ మూవీస్ కి సెట్ చేసింది.
అంటే యావరేజ్ గా ఒక రోజుకి 144 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని ఊచకోత కోసింది పుష్ప2 మూవీ…ఇక అప్ కమింగ్ టైంలో మరిన్ని బిగ్ పాన్ ఇండియా మూవీస్ రిలీజ్ కానున్నా కూడా పుష్ప2 రేంజ్ లో బాక్స్ ఆఫీస్ భీభత్సం ఏ సినిమా సృష్టిస్తుందో చూడాలి ఇక…