బాక్స్ ఆఫీస్ దగ్గర నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ దసరా సినిమా మొదటి వారాన్ని పూర్తీ చేసుకుని రెండో వారంలో అడుగు పెట్టింది. సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో నైజాంలో ఓవర్సీస్ లో దుమ్ము దుమారం లేపగా మిగిలిన చోట్ల మరీ అంచనాలను అందుకొక పోయిన ఉన్నంతలో బాగానే పెర్ఫార్మ్ చేసింది. ఇక సినిమా ఇప్పుడు ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర నాని కెరీర్ లోనే…
మొట్ట మొదటి సారిగా 100 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించింది. అలాగే టాలీవుడ్ లో మీడియం రేంజ్ మూవీస్ లో కూడా ఫాస్టెస్ట్ 100 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని మరో సంచలనం సృష్టించింది ఈ సినిమా. అలాగే టైర్ 2 హీరోల్లో ఈ మార్క్ ని అందుకున్న…
రెండో సినిమాగా నిలిచింది దసరా సినిమా… ఇది వరకు విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం సినిమా 2 వారాలకి పైగా టైం తీసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్ల గ్రాస్ ని అందుకుని ఒకే ఒక్క టైర్ 2 హీరో 100 కోట్ల గ్రాస్ మూవీ గా నిలిచి సంచలనం సృష్టించగా ఈ రికార్డ్ ను…
ఇప్పుడు సగం రోజులకే అందుకుని దసరా మూవీ సంచలనం సృష్టించింది. టైర్ 2 హీరోల్లో ఫాస్టెస్ట్ 100 కోట్ల గ్రాస్ మార్క్ తో పాటు కెరీర్ లో ఫస్ట్ 100 కోట్ల గ్రాస్ మార్క్ మూవీ తో నాని సంచలనం సృష్టించాడు. ఇక లాంగ్ రన్ లో సినిమా ఎంతవరకు కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.