Home న్యూస్ హిట్ ఫస్ట్ డే కలెక్షన్స్….బాగానే కుమ్మాడు!!

హిట్ ఫస్ట్ డే కలెక్షన్స్….బాగానే కుమ్మాడు!!

2241
0

నాచురల్ స్టార్ నాని సమర్పణ లో విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ హిట్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి థ్రిల్లర్ జానర్ మూవీస్ అండ్ డిఫెరెంట్ కాన్సెప్ట్ మూవీస్ ఇష్టపడే వారి నుండి మంచి టాక్ బయట వినిపిస్తుంది, ఆ ప్రభావం ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు వసూళ్ళ పరంగా కొంచం బెటర్ గా ఎఫెక్ట్ చూపుతుంది అని చెప్పాలి.

   సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అడ్వాన్స్ బుకింగ్స్ చాలా వీక్ గా మొదలు అయినా మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల సమయానికి ఇంప్రూవ్ మెంట్ మొదలు పెట్టిన సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోలకు వచ్చే సరికి క్లాస్ సెంటర్స్ లో బాగానే పికప్ అయింది.

ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అన్ని సెంటర్స్ ల రిపోర్ట్స్ కంప్లీట్ గా అందలేదు కానీ ఉన్నంతలో సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోలకు 10% టు 15% వరకు గ్రోత్ ని సాధించగా మొత్తం మీద ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో 70 లక్షల రేంజ్ షేర్ ని అందుకునేలా సినిమా జోరు చూపుతుందని చెప్పొచ్చు.

కంప్లీట్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అనుకున్నట్లు ఉంటె 80 లక్షల మార్క్ నుండి 90 లక్షల రేంజ్ షేర్ ని కూడా సినిమా అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా మొదటి రోజు 1.2 కోట్ల నుండి 1.4 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించే అవకాశం ఉందని చెప్పొచ్చు.

సినిమా టార్గెట్ కూడా 5 కోట్లే అవ్వడం తో ఈ కలెక్షన్స్ అనుకున్నట్లే వస్తే సూపర్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్నట్లే అని చెప్పాలి. వీకెండ్ మొత్తం ఇదే విధంగా హోల్డ్ చేస్తే అవలీలగా బిజినెస్ లో చాలా మొత్తాన్ని వీకెండ్ కే వనక్కి తెచ్చే చాన్స్ ఉంటుంది, ఇక ఫస్ట్ డే అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

avatar
  Subscribe  
Notify of