టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ వకీల్ సాబ్ ఆడియన్స్ ముందుకు రెండు తెలుగు రాష్ట్రాలలో 1200 వరకు థియేటర్స్ లో భారీ ఎత్తున రిలీజ్ ను సొంతం చేసుకుంది. టికెట్ హైక్స్ భారీ గా పెంచి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టగా రికార్డ్ లెవల్ బుకింగ్స్ జరిగాయి కానీ సడెన్ గా ఆంధ్రప్రదేశ్ లో టికెట్ హైక్స్ తగ్గించడం తీవ్ర ఇంపాక్ట్ ని చూపింది, దానికి తోడూ బెనిఫిట్ షోలు…
మిడ్ నైట్ షోలు చాలా చోట్ల పడనే లేదు…. అవన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంపాక్ట్ చూపి మొదటి రోజు కలెక్షన్స్ పై ఇప్పుడు ఎఫెక్ట్ చూపబోతున్నాయి. అవలీలగా 32-35 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ఖాయం అనుకున్నా ఇప్పుడు తగ్గిన రేట్లు ఎఫెక్ట్ చూపుతూ ఉండటం తో…
మొదటి రోజు 22-25 కోట్ల రేంజ్ షేర్ ని సాధించవచ్చు అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి, కానీ కొన్ని చోట్లా మొదటి రోజు కూడా టికెట్ హైక్స్ ఉండటం తో వాటి లెక్కలు అన్నీ తేలాల్సి ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కూడా అన్ని చోట్ల అంచనాలను మించి ఉంటే…
ఈ కలెక్షన్స్ ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఎంతైనా ఉంది. కానీ మొత్తం మీద కలెక్షన్స్ పై ఎఫెక్ట్ సాలిడ్ గా పడింది… మొదటి రోజు రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపాల్సిన సినిమా అనుకోని అవరోధాల వలన ఇప్పుడు అనుకున్న కలెక్షన్స్ ని అందుకోలేని పరిస్థితి ఎదురు అయ్యింది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నైజాం లో సంచలనాలను సృష్టించడం ఖాయం…
ఇక ఆంధ్ర లో ఓవరాల్ లెక్కలు అనుకూలంగా ఉండి హైర్స్ తొలిరోజు అన్నీ ఓకే అయితే ఓవరాల్ గా మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకోవచ్చు, కానీ ఫస్ట్ డే ఆల్ టైం రికార్డులు నమోదు చేసే అవకాశం మిస్ అయినట్లే అని చెప్పాలి. ఇక మొదటి రోజు అఫీషియల్ గా సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి ఇక..