మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ సైరా నరసింహా రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయ్యి అద్బుతమైన కలెక్షన్స్ ని తెలుగు రాష్ట్రాలలో అలాగే కర్ణాటక లో సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. కాగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో 90 కోట్లకు పైగా షేర్ ని వసూల్ చేయగా మిగిలిన చోట్ల కలిపి టోటల్ గా 122 కోట్లకు పైగా షేర్ ని అందుకుంది ఈ సినిమా.
భారీ ఆశలతో వరల్డ్ వైడ్ గా 4600 కి పైగా థియేటర్స్ రిలీజ్ అయిన సైరా సినిమా హిందీ వర్షన్ భారీ హోప్స్ తో 1600 థియేటర్స్ లో రిలీజ్ అయింది, ముందు 2500 వరకు థియేటర్స్ దొరుకుతాయి అనుకున్నా నిర్మాతలు అసలు ప్రమోషన్ చేయక పోవడంతో…
అసలు అక్కడ ట్రైలర్ కి పాజిటివ్ టాక్ వచ్చినా అసలు వస్తుందో లేదో అన్న అనుమానంతో థియేటర్స్ మరీ ఎక్కువ దొరకలేదు. రిలీజ్ అయిన తర్వాత పాజిటివ్ టాక్ వచ్చాక అయినా ప్రమోషన్స్ చేయాల్సింది కానీ ఇప్పటి వరకు అలాంటి పనులు యూనిట్ చేయక పోవడం తో సినిమా ఇప్పుడు అక్కడ రెండో వారం దాదాపు…
థియేటర్స్ అన్నీ కోల్పోయింది. ఇప్పుడు కేవలం రెండో వారం లో అక్కడ 400 స్క్రీన్స్ లో రన్ అవుతుంది సినిమా, అది కూడా రోజు కి ఒకటి రెండు షోల మాదిరిగా అక్కడ రన్ అవుతుంది, బాలీవుడ్ లో కూడా యావరేజ్ గా 3.5 రేటింగ్ తో ఓపెన్ అయ్యింది సైరా నరసింహా రెడ్డి సినిమా.
కానీ కనీసం ప్రమోషన్స్ చేసి ఉన్నా సినిమా ఇప్పటికే సగానికి పైగా బిజినెస్ ని అయినా మినిమమ్ రికవరీ చేసి ఉండేది, కానీ ఇప్పుడు సినిమా అక్కడ భారీ డిసాస్టర్ గా మిగిలిపోనుంది. ఈ వీకెండ్ లో కూడా పెద్దగా పెర్ఫార్మెన్స్ లేక పొతే సోమవారం దాదాపు థియేటర్స్ నుండి తొలగిపోయే పరిస్థితి అక్కడ ఏర్పడుతుందని సమాచారం.