Home గాసిప్స్ 3 కోట్ల హీరో నుండి ఇప్పుడు సునీల్ రెమ్యునరేషన్ తెలిస్తే మైండ్ బ్లాంక్!!

3 కోట్ల హీరో నుండి ఇప్పుడు సునీల్ రెమ్యునరేషన్ తెలిస్తే మైండ్ బ్లాంక్!!

4576
0

టాలీవుడ్ టాప్ కమెడియన్స్ లో సునీల్ ముందు నిలిచే వారు అని చెప్పాలి, ఓ 15 ఏళ్ల క్రితం ఒక పక్క బ్రహ్మానందం జోరు పీక్స్ లో ఉన్నా కానీ సునీల్ కూడా చేతినిండా సినిమాలతో ప్రతీ సినిమాలో కంపల్సరీ గా ఉంటూ తన కామెడీ తో ఆడియన్స్ ను అలరిస్తూ ఉండేవారు, అలాంటి పీక్ టైం లోనే రోజు కి 10 లక్షల రేంజ్ రెమ్యునరేషన్ తీసుకున్న సునీల్ హీరోగా మర్యాద రామన్న తో మారిపోయాడు.

ఆ సినిమా తర్వాత పూలరంగడు సినిమాలు సూపర్ హిట్ గా నిలవడం తో చేతినిండా హీరోగా సినిమాలు చేస్తూ వచ్చిన సునీల్ సినిమా కి రెమ్యునరేషన్ గా 3 కోట్ల దాకా అందుకునేవారు… కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర పూలరంగడు సినిమా తర్వాత సునీల్ చేసిన అన్ని సినిమాలలో…

ఏవి కూడా హిట్ గీతని దాటలేక పోవడం తో తన మార్కెట్ భారీగా పడిపోయింది… దీంతో మళ్ళీ కమెడియన్ రోల్స్ కి ట్రై చేసినా పెద్దగా వర్కౌట్ కాని పరిస్థితిలో ఈ ఇయర్ డిస్కో రాజా లో అటు కామెడీ అండ్ ఇటు నెగటివ్ టచ్ ఉన్న రోల్ చేయగా అది పెద్దగా వర్కౌట్ కాలేదు.

తర్వాత రీసెంట్ గా వచ్చిన కలర్ ఫోటో లో సునీల్ విలనిజం పై మంచి ప్రశంసలే దక్కుతు ఉండగా ఈ సినిమా కోసం సునీల్ తీసుకున్న రెమ్యునరేషన్ హాట్ టాపిక్ గా మారింది ఇప్పుడు. 10 రోజుల కాల్ షీట్స్ ఈ సినిమా కోసం ఇచ్చిన సునీల్ కేవలం రోజుకి 1 లక్ష చొప్పున 10 లక్షల రెమ్యూనరేషన్ ని తీసుకుని…

యాక్ట్ చేశారట… చిన్న సినిమా కాబట్టి తక్కువ తీసుకున్నారు అనుకున్నా డిస్కోరాజా, అల వైకుంటపురంలో, ఇలా రీసెంట్ టైం లో సునీల్ చేసిన సినిమాలకు అన్నింటికి కూడా ఇదే జరిగిందని అంటున్నారు… ఒకప్పుడు తన కామెడీ తో అందరినీ ఓ రేంజ్ లో అలరించిన సునీల్ ఇప్పుడు స్ట్రగుల్ అవుతుండటంతో కచ్చితంగా ఓ మంచి కంబ్యాక్ అవసరమని చెప్పొచ్చు. ఫ్యూచర్ లో అలాంటి సాలిడ్ కంబ్యాక్ సునీల్ కి దక్కాలని మనమూ కోరుకుందాం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here