బాక్స్ ఆఫీస్ దగ్గర బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా రేంజ్ లో సెన్సేషనల్ క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ఆ సినిమాల ఊపుతో నార్త్ లో కూడా ప్రభాస్ కి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది, ఆ ఫాలోయింగ్ ఎలాంటిదో సాహో సినిమా తో రుజువు అయింది, బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాఫ్ టాక్ ని సొంతం చేసుకున్న ఆ సినిమా తో సెన్సేషనల్ కలెక్షన్స్ ని…
హిందీ లో సొంతం చేసుకున్న ప్రభాస్ అక్కడ సూపర్ హిట్ గా మార్చుకుని సత్తా చాటుకున్నాడు… అలాంటి క్రేజ్ ను దక్కించుకున్న ప్రభాస్ తనకున్న యాక్షన్ ఇమేజ్ ను పక్కకు పెట్టి… ఒక్క ఫైట్ సీన్ కూడా లేని రాధే శ్యామ్ సినిమాను సెలెక్ట్ చేసుకున్నాడు…
కంప్లీట్ క్లాస్ సబ్జెక్ట్ అయిన ఈ సినిమా కి బాలీవుడ్ లో ఓపెనింగ్స్ మరీ అద్బుతం అనిపించకున్నా డీసెంట్ గానైనా వస్తాయి అనుకున్నారు అంతా… కానీ మొదటి రోజు సినిమా కలెక్షన్స్ అందరికీ ఆశ్యర్యపరుస్తూ చాలా తక్కువ రిపోర్ట్ అయ్యాయి. 4.50 కోట్ల నెట్ కలెక్షన్స్ ని మాత్రమే సినిమా ఓవరాల్ గా మొదటి రోజు సొంతం చేసుకుంది…
హిందీలో డబ్ అయిన మూవీస్ పరంగా హైయెస్ట్ కలెక్షన్స్ ని మొదటి రోజు సాధించిన సినిమాలను గమనిస్తే
👉#Bahubali2 – 40.73Cr
👉#Saaho – 24.4Cr
👉#2Point0 – 19.74Cr
👉#Baahubali 1- 5.15Cr
👉#RadheShyam – 4.50Cr*****
👉#Zanjeer – 3.58Cr
👉#Kabali – 3.50Cr
👉#Pushpa – 3.31Cr
👉#SyeRaa – 2.6Cr
👉#KGFChapter1- 2.10Cr
బాహుబలి తో 40.73 కోట్ల రేంజ్ ఓపెనింగ్స్ ను అందుకున్న ప్రభాస్, సాహో లాంటి డిసాస్టర్ తో కూడా…..
24.40 కోట్ల రేంజ్ లో నెట్ కలక్షన్స్ తో ఓపెన్ అవ్వగా ఇప్పుడు మాత్రం కేవలం 4.50 కోట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది… బాలీవుడ్ ఆడియన్స్ కోసం హిందీ లో కూడా రూపొందిన ఈ సినిమా కి అక్కడ ఇలాంటి రెస్పాన్స్ రావడం కొంత విచారకరం అనే చెప్పాలి. కానీ లాంగ్ రన్ లో సినిమా పుంజుకునే అవకాశం ఉంది కానీ టార్గెట్ ని అందుకునే రేంజ్ లో ఉంటుందో ఉండదో చూడాలి…