డిసెంబర్ నుండి 5 సార్లు పోస్ట్ పోన్…ఇంకా ఎప్పటికి వస్తుందో ఈ సినిమా!

0
749

  ఒక డేట్ కి ఫిక్స్ అయ్యి ఆ డేట్ కి ప్రేక్షకుల ముందుకు వచ్చే సినిమాలు చాలా తక్కువ అయ్యాయి రీసెంట్ టైం లో, పెద్ద హీరోలు చిన్న హీరోలు అన్న తేడా లేదు, ఒక డేట్ ని ముందు అనౌన్స్ చేసి చివరి నిమిషం లో పోస్ట్ పోన్ చేయడం మాత్రం ఎక్కువ అయింది, మహర్షి విషయం లో అదే జరగగా ఇప్పుడు యంగ్ హీరో నిఖిల్ నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సురవరం కూడా…

ఇదే పరిస్థితిని ఎదురుకుంటుంది, సినిమా ను ముందు లాస్ట్ ఇయర్ డిసెంబర్ ఎండింగ్ లో రిలీజ్ అనుకున్నా అప్పటి నుండి పోస్ట్ పోన్లు మొదలు అయ్యి వరుసగా మార్చి మొదట్లో అని, తర్వాత చివర్లో అని, ఏప్రిల్ మొదటి వారంలో అని తర్వాత మూడో వారంలో అని,

ఆఖరికి మే 1 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అని అంతా అనుకుంటున్న సమయంలో అవెంజర్స్ అలాగే ఇతర హిట్ మూవీస్ వలన షోలు దొరకె అవకాశం తక్కువగా ఉందని మేకర్స్ సినిమాను ఇప్పుడు మే మూడో వారానికి పోస్ట్ పోన్ చేశారట. తక్కువ సమయం లో ఇన్ని సార్లు పోస్ట్ పోన్ అయిన సినిమా ఇదేనేమో అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here