మార్చ్ లో మూసుకున్న థియేటర్స్ ఎప్పుడెప్పుడు తెరచు కుంటాయా అని సినీ ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.. ఆల్ మోస్ట్ 6 నెలలు గడవడం, రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సినిమాలు ఉన్నా కానీ ఎక్కువ శాతం సినిమాలు డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ ని సొంతం చేసుకుంటూ వస్తుండటం తో వాటిని ఇంట్లో, మొబైల్స్ లో కంప్యూటర్ లేదా లాప్ టాప్స్ లో చూడటం తో సరిపెట్టుకున్న సినీ లవర్స్ ఎప్పుడెప్పుడు….
థియేటర్స్ రీ ఓపెన్ అవుతాయా అని ఆశగా ఎదురు చూస్తుండగా ఎట్టకేలకు అక్టోబర్ 15 నుండి రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతిస్తే థియేటర్స్ ని తెరుచుకోవచ్చు అని సెంట్రల్ నుండి నోటిస్ వచ్చేసింది. దాంతో చాలా రాష్ట్రాలు దీనికి ఒప్పుకోగా కొన్ని రాష్ట్రాలు మాత్రం నవంబర్ 1 నుండి…
థియేటర్స్ ని తెరచే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది, ఇక టాలీవుడ్ విషయానికి వస్తే ఇప్పటికే కొన్ని సినిమాలు డైరెక్ట్ రిలీజ్ ని సొంతం చేసుకోగా కొన్ని చర్చల దశలో ఉండగా కొన్ని సినిమాలు మాత్రం థియేటర్స్ ఎప్పుడు రీ ఓపెన్ చేస్తే అప్పుడే వద్దామని ఆగాయి… అలాంటి సినిమాల్లో దసరా టైం నుండి రంగం లోకి దిగడానికి….
సిద్ధంగా ఉన్న సినిమాలను ఒకసారి గమనిస్తే, ఉప్పెన, రెడ్ మూవీ, క్రాక్ ముందు వరుసలో ఉన్న సినిమాలు కాగా వీటి తర్వాత సోలో బ్రతుకే సో బెటర్, లవ్ స్టొరీ, రంగ్ దే, అల్లుడు అదుర్స్, అరణ్య లాంటి నోటబుల్ మూవీస్ ఆల్ మోస్ట్ ఫినిష్ అయిపోయి అటు OTT వైపు వెళ్ళాలా లేక థియేటర్స్ లోకి వెళ్ళాలా అన్న….
డౌట్ లో ఉండగా ఇప్పుడు ఎదో ఒక దారి వెతుకున్నే అవకాశం ఉంది, ఇక టాలీవుడ్ బిగ్ మూవీస్ లో వకీల్ సాబ్ కి ఇప్పుడు సంక్రాంతి రేసు లో నిలిచే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పాలి… ఇక ఆ టైం కి మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ కూడా రావచ్చు… మరి వీటిలో ముందు రిస్క్ చేసి రిలీజ్ అయ్యే సినిమా ఏది అవుతుందో చూడాలి…