Home న్యూస్ కామెడీతో కుమ్మేస్తున్న ఫుక్రే3…3 రోజుల్లో రాక్ సాలిడ్ కలెక్షన్స్!

కామెడీతో కుమ్మేస్తున్న ఫుక్రే3…3 రోజుల్లో రాక్ సాలిడ్ కలెక్షన్స్!

0

బాలీవుడ్ ఇండస్ట్రీ బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్ టు బాక్ ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే సినిమాలతో దుమ్ము లేపుతూ ఉండగా గదర్2(Gadar2) జవాన్(Jawan) మరియు డ్రీమ్ గర్ల్2(Dream Girl2), OMG2 ఇలా వరుస హిట్స్ తో దుమ్ము లేపుతూ ఉండగా…

రీసెంట్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర మరో సినిమా దుమ్ము లేపుతూ దూసుకు పోతుంది. మంచి కామెడీ ఫ్రాంచేజ్ లో ఒకటైన ఫుక్రే(Fukrey) సిరీస్ లో భాగంగా వచ్చిన మూడో పార్ట్ ఫుక్రే3(Fukrey3 Movie) రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా బాగానే ఆకట్టుకుంది…

లాజిక్ లు ఏమి వెతకకుండా జస్ట్ కామెడీని ఎంజాయ్ చేయాలి అంటే ఈ సినిమాకి వెళ్ళొచ్చు… 2 గంటల 30 నిమిషాల సినిమాల్లో చాలా సీన్స్ హాయిగా నవ్వేలా మెప్పించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా కూడా కుమ్మేస్తూ దూసుకు పోతూ ఉంది…

సినిమా మొదటి రోజు 8.82 కోట్ల నెట్ కలెక్షన్స్ ని, రెండో రోజు 7.81 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకోగా మూడో రోజు మరింత జోరు చూపించి 11.67 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకుని 3 రోజుల్లో ఏకంగా 28.30 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోగా…

4వ రోజు 5వ రోజు ఫుల్ హాలిడేస్ అవ్వడంతో మరింత జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉందని అంటున్నారు. బాలీవుడ్ కి మరో 100 కోట్ల నెట్ కలెక్షన్స్ మూవీగా ఈ సినిమా నిలవడం ఖాయమని అంటూ ఉండటం విశేషం. మరి సినిమా లాంగ్ రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here