క్యారక్టర్ రోల్స్ నుండి హీరోగా మారిన శ్రీ విష్ణు అడపాదడపా సినిమాలు చేస్తూ వస్తూ ఉన్నా బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం కన్సిస్టంట్ గా హిట్స్ అందుకోలేక పోతున్నాడు, బ్రోచేవారెవరురా సూపర్ హిట్ తర్వాత శ్రీ విష్ణు చేసిన సినిమాలు ఏవి కూడా అంచనాలను అందుకోలేక పోయాయి. ఇలాంటి టైం లో మళ్ళీ శ్రీ విష్ణు బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు తన లక్ ని పరీక్షంచుకోవడానికి సిద్ధం అవుతున్న సినిమా గాలి సంపత్.
శ్రీ విష్ణు రాజేంద్రప్రసాద్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా మహా శివరాత్రి కానుకగా ఆడియన్స్ ముందుకు 11 న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది. ఇక సినిమా ఓవరాల్ గా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు బయటికి వచ్చాయి. ఒకసారి ఆ లెక్కలను గమనిస్తే..
సినిమా మొత్తం మీద నైజాం ఏరియా లో 2 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకోగా సీడెడ్ ఏరియా లో 1 కోటి బిజినెస్ ను సాధించింది, ఇక ఆంధ్ర లో సినిమా 3 కోట్ల దాకా బిజినెస్ ను సాధించగా సినిమా టోటల్ గా రెండు తెలుగు రాష్ట్రాలలో 6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుంది.
ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ కలిపి టోటల్ గా మరో 50 లక్షల మేర బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ వరల్డ్ వైడ్ గా 6.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుంది, ఇది శ్రీ విష్ణు కెరీర్ లో హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ గా చెప్పుకోవచ్చు. ఇక సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర..
బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మినిమమ్ 7 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం నెలకొంది అని చెప్పాలి. పోటి తీవ్రంగా ఉన్న టైం లో ఇంత బిజినెస్ ను రికవరీ చేయడం అంటే కష్టమే కానీ సినిమా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి టాక్ బాగుంటే సినిమా లాంగ్ రన్ లో అంచనాలను అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.