Home న్యూస్ సింహాద్రి రికార్డ్ ను బ్రేక్ చేసిన గబ్బర్ సింగ్…సీమలో కొత్త రికార్డ్!

సింహాద్రి రికార్డ్ ను బ్రేక్ చేసిన గబ్బర్ సింగ్…సీమలో కొత్త రికార్డ్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన బ్లాక్ బస్టర్ మూవీ గబ్బర్ సింగ్(Gabbar Singh4K) మూవీ, రీసెంట్ గా గ్రాండ్ గా రీ రిలీజ్ అవ్వగా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేసింది…రీ రిలీజ్ మూవీస్ లో ఓవరాల్ గా…

బిగ్గెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని రికార్డ్ ను నమోదు చేసింది…ఇక సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర సీడెడ్ లలో ఎక్స్ లెంట్ గా పెర్ఫార్మ్ చేసింది నైజాంతో పోల్చితే, అది కూడా వర్షాలను తట్టుకుని… ఓవరాల్ గా రాయలసీమ లో ఇప్పటి వరకు రిలీజ్ అయిన మూవీస్ లో..

లాస్ట్ ఇయర్ వచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన సింహాద్రి(Simhadri) మూవీ 76 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని రికార్డ్ ను నమోదు చేసింది. ఆ సినిమా రికార్డ్ ను తర్వాత వచ్చిన ఏ సినిమా కూడా అందుకోలేక పోయింది. కానీ ఇప్పుడు సింహాద్రి తో పోల్చితే…

ఎక్కువ షోలతో రిలీజ్ అయిన గబ్బర్ సింగ్ మూవీ సీడెడ్ లో సింహాద్రి కలెక్షన్స్ ని దాటేసి 81 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది. ఒకసారి సీడెడ్ లో రీ రిలీజ్ మూవీస్ లో మొదటి రోజు టాప్ కలెక్షన్స్ ని అందుకున్న మూవీస్ ని గమనిస్తే…

Re Release Movies Ceeded 1st Day Top Collections
👉#GabbarSingh4K – 81L~(NEW RECORD)💥💥
👉#Simhadri4K – 76L
👉#Kushi4K – 45L
👉#Jalsa- 39L
👉#Businessman4K – 35L
👉#Murari4K – 32L
👉#Indra4K – 30L~

మొత్తం మీద గబ్బర్ సింగ్ మూవీ రీ రిలీజ్ లో సీడెడ్ లో కొత్త రికార్డును కొంచం మార్జిన్ తో బ్రేక్ చేసి కొత్త రికార్డ్ ను నమోదు చేసింది. ఇక గబ్బర్ సింగ్ మూవీ నెలకొల్పిన రికార్డ్ కలెక్షన్స్ ని ఫ్యూచర్ లో వచ్చే ఏ సినిమా బ్రేక్ చేస్తుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here