బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా సినిమాలు ఊహకందని కలెక్షన్స్ తో ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచాయి. కానీ 2001 టైంలో రిలీజ్ అయిన ఒక ప్రేమకథని చూడటానికి జనాలు ఆల్ ఇండియా లెవల్ లో ఎగబడ్డారు. 100 రోజుల రన్ తర్వాత కూడా ఆ సినిమా హిస్టారికల్ కలెక్షన్స్ ని సాధించింది.
ఆ సినిమా కలెక్షన్స్ ని దాటడానికి ఇతర స్టార్స్ కి కొన్ని ఏళ్ల టైం పట్టింది… ఆ సినిమానే గదర్ ఏక్ ప్రేమ్ కథ…. సన్నీ డియోల్ అమీషా పటేల్ ల కాంబోలో వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయగా సినిమా వచ్చిన ఆల్ మోస్ట్ 22 ఏళ్ల తర్వాత…
ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ ను ఆగస్ట్ 11న రిలీజ్ చేయబోతుండగా ఒక్క సారి ఆడియన్స్ కి గదర్ సాధించిన విజయాన్ని గుర్తు చేయడానికి సినిమాను జూన్ 9న రీ రిలీజ్ చేశారు. 4K లో రీ మాస్టర్ వర్షన్ ను రిలీజ్ చేయగా ఆడియన్స్ నుండి రెస్పాన్స్ ఓ రేంజ్ లో వచ్చింది.
సినిమా రిలీజ్ అయిన చాలా సెంటర్స్ లో 50-60% రేంజ్ లో ఆక్యుపెన్సీ ఉండగా కొన్ని చోట్ల షోలు ఏకంగా హౌస్ ఫుల్ గా కూడా నిలిచాయి. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. సన్నీ డియోల్ నటించిన చాలా కొత్త సినిమాలకే జనాలు లేక షోలు కాన్సిల్ అయినవి ఉన్నాయి…
అలాంటిది రీ రిలీజ్ అయిన మూవీకి హౌస్ ఫుల్స్ పడటం నిజంగానే విశేషం అని చెప్పాలి… ఇప్పుడు గదర్ కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే సీక్వెల్ మూవీ మినిమమ్ బాగుంది అనిపించే టాక్ ని సొంతం చేసుకున్నా కానీ కలెక్షన్స్ పరంగా దుమ్ము లేపే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పాలి.