మెగాస్టార్ చిరంజీవి బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ల కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ ఆడియన్స్ ముందుకు భారీ లెవల్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉంది, సినిమా పై ఆచార్య డిసాస్టర్ ఎఫెక్ట్ అలాగే ఆల్ రెడీ తెలుగులోనే డబ్ అయిన సినిమాను రీమేక్ చేస్తున్నారు అన్న నెగటివ్ ఇంప్రెషన్ ఆడియన్స్ లో ఉన్నప్పటికీ కూడా చాలా వరకు ఒరిజినల్ కథని మార్చారు అని…
మేకర్స్ చెబుతూ ఉండటం, ట్రైలర్ కూడా ఆడియన్స్ ను మెప్పించే విధంగా ఉండటంతో సినిమా పై అంచనాలు ఏర్పడ్డాయి. ఇక సినిమా మొత్తం మీద 92 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ఆల్ మోస్ట్ 1705 థియేటర్స్ లో వరల్డ్ వైడ్ గా…
గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మూడు రోజుల ముందే మొదలు అవ్వగా ఓవరాల్ బుకింగ్స్ బాగానే ఉన్నాయి కానీ చిరు లాస్ట్ 3 మూవీస్ తో పోల్చితే మాత్రం చాలా తక్కువ బుకింగ్స్ నే ఈ సినిమా సొంతం చేసుకుంటూ ఉందని చెప్పాలి ఇప్పుడు… మొత్తం మీద థియేటర్స్ కౌంట్ కూడా…
చిరు ప్రీవియస్ మూవీస్ తో పోల్చితే తక్కువే అవ్వడంతో మొత్తం మీద నైజాంలో 55% కి అటూ ఇటూగా బ్లాక్ చేసిన సీట్స్ తో ఆక్యుపెన్సీ ఉండగా ఆంధ్రప్రదేశ్ లో టోటల్ గా 70% వరకు బ్లాక్ చేసిన సీట్స్ తో ఆక్యుపెన్సీ కనిపిస్తుంది. దాంతో ఇప్పుడు సినిమా తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు ఈ బుకింగ్స్ ప్రకారం 16 కోట్ల నుండి 18 కోట్ల రేంజ్ లో..
షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది, ఇక అన్ని చోట్ల టాక్ స్ప్రెడ్ అయ్యి షో షోకి కలెక్షన్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళితే 20 నుండి 22 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ని అందుకోవచ్చు. ఇవి ఆచార్యతో పోల్చితే చాలా తక్కువే అని చెప్పాలి. మరి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.