Home న్యూస్ గేమ్ చేంజర్ నైజాం బిజినెస్…టాక్ వస్తే ఊచకోత ఖాయం!!

గేమ్ చేంజర్ నైజాం బిజినెస్…టాక్ వస్తే ఊచకోత ఖాయం!!

0

ట్రైలర్ రిలీజ్ కి ముందు వరకు ఎలా ఉన్నా కూడా ట్రైలర్ రిలీజ్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) శంకర్(Shankar) ల సెన్సేషనల్ మూవీ గేమ్ చేంజర్(Game Changer) సినిమా మీద అంచనాలు బాగానే పెరిగి పోయాయి. రిలీజ్ కి టైం దగ్గర పడుతున్న కొద్ది బిజినెస్ పరంగా కూడా కుమ్మేసిన సినిమా…

ఏరియాల బిజినెస్ లెక్కలు కన్ఫాం అవుతూ ఉండగా….లేటెస్ట్ గా నైజాం ఏరియా వాల్యూ బిజినెస్ లెక్కలు కన్ఫాం అయ్యాయి…సోలో హీరో గా రామ్ చరణ్ కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ బిజినెస్ ను సొంతం చేసుకుని మాస్ భీభత్సం సృష్టించింది గేమ్ చేంజర్…

ఇది వరకు రామ్ చరణ్ నటించిన వినయ విదేయ రామ సినిమా నైజాం లో 24 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను అందుకోగా తర్వాత ఎన్టీఆర్ తో కలిసి చేసిన ఆర్ ఆర్ ఆర్ మూవీ 70 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకోగా….తర్వాత చిరంజీవి తో కలిసి చేసిన…

ఆచార్య మూవీ 38.50 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకుంది… ఓవరాల్ గా ఇప్పుడు సోలో హీరోగా రామ్ చరణ్ చేస్తున్న గేమ్ చేంజర్ మూవీ నైజాంలో ఆల్ మోస్ట్ 43.50 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకుంది…దాంతో కెరీర్ బెస్ట్ బిజినెస్ తో కుమ్మేసిన…

గేమ్ చేంజర్ మూవీ కి అన్ని చోట్లా మంచి టికెట్ హైక్స్ సొంతం అవ్వడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా నైజాంలో కూడా మంచి టికెట్ హైక్స్ ఉండే అవకాశం ఎంతైనా ఉండగా సంక్రాంతి రేసులో మిగిలిన సినిమాల మధ్య పోటిలో ఉన్నప్పటికీ కూడా పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో…

శంకర్ లాంటి టాప్ డైరెక్టర్ డైరెక్షన్ లో వస్తున్న గేమ్ చేంజర్ మూవీ ఏమాత్రం పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నా కూడా ఈ బిజినెస్ ను అవలీలగా రికవరీని సొంతం చేసుకోవడమే కాదు మంచి లాభాలను అందుకోవచ్చు. మరి గేమ్ చేంజర్ ఎంతవరకు అంచనాలను అందుకుని కుమ్మేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here