ఆర్ ఆర్ ఆర్ తర్వాత సోలో హీరోగా ఏకంగా ఇండియన్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన శంకర్ తో సినిమా….అనౌన్స్ చేసినప్పుడు హైప్ మరో లెవల్ లో ఉండేది…అనుకున్న బడ్జెట్ అంచనాలను ఎప్పటికప్పుడు మించిపోయినా కూడా జనాలలో అనుకున్న రేంజ్ లో హైప్ ను సొంతం చేసుకునే విషయంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్(Game Changer Movie)…
అంచనాలను అందుకోలేక పోయింది. సంక్రాంతికి రిలీజ్ ను అనౌన్స్ చేయగా పాన్ ఇండియా రేంజ్ లో పెద్దగా పోటి ఏమి లేకుండా రిలీజ్ చేయడంతో ఏమాత్రం టాక్ బాగున్నా కలెక్షన్స్ భీభత్సం సృష్టిస్తుంది అనుకున్నా కూడా మొదటి ఆటకే మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకున్న సినిమాకి…
సోషల్ మీడియాలో అన్ని వైపుల నుండి ఓ రేంజ్ లో నెగటివ్ టాక్ స్ప్రెడ్ అయింది…దానికి తోడూ పోటిలో వచ్చిన ఇతర సినిమాలకు బెటర్ టాక్ రావడంతో ఇక గేమ్ చేంజర్ మూవీ తేరుకోవడం కష్టం అయింది…రీసెంట్ టైంలో దేవర కి తొలి రోజుల్లో ఈ రేంజ్ లో మిక్సుడ్ టాక్ స్ప్రెడ్ అయినా ఆ సినిమా తేరుకుంది…
కానీ గేమ్ చేంజర్ విషయంలో అది జరగలేదు…ఇన్ని అవరోధాలను ఫేస్ చేసిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారంలో 100 కోట్ల షేర్ మైలురాయిని సొంతం చేసుకుని రామ్ చరణ్ కెరీర్ లో మరో 100 కోట్ల షేర్ మూవీగా నిలిచింది…సినిమాకి మొదటి రోజు స్ప్రెడ్ అయిన టాక్ కి…
అలాగే ఫస్ట్ డే కలెక్షన్స్ పోస్టర్ ట్రోల్స్ కి పోటిలో ఉన్న సినిమాల వలన తేరుకుంటుందో లేదో అనుకున్నా కూడా ఎట్టకేలకు 100 కోట్ల షేర్ మార్క్ ని దాటేసిన సినిమా గ్రాస్ పరంగా త్వరలో 200 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకోబోతుంది…కానీ సినిమాకి అనుకున్న రేంజ్ లో టాక్ ఆడియన్స్ నుండి…
వచ్చి ఉంటే కనుక సంక్రాంతికి వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే సినిమాగా నిలిచేది…కానీ ఇప్పుడు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లాస్ ను సొంతం చేసుకున్న సినిమాగా నిలవబోతున్నప్పటికీ ఈ పరిస్థితిలో ఈ మైలురాయిని అందుకుని రామ్ చరణ్ సత్తా చాటుకున్నాడు. ఇక లాంగ్ రన్ లో లాస్ ను ఎంతవరకు తగ్గించుకునే ప్రయత్నం చేస్తాడో చూడాలి.