గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ఆర్ ఆర్ ఆర్ లాంటి ఎపిక్ బ్లాక్ బస్టర్ తర్వాత సోలో హీరోగా చేస్తున్న సెన్సేషనల్ మూవీ గేమ్ చేంజర్(Game Changer Movie) మీద ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి…శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా కచ్చితంగా ఆడియన్స్ అంచనాలను మించి పోయే రేంజ్ లో ఉంటుంది అని అందరూ నమ్ముతున్నారు….
ప్రస్తుతానికి బజ్ పరంగా మరీ అనుకున్న రేంజ్ లో బజ్ అయితే లేక పోయినా కూడా ఒక్క సారి సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత లెక్కలు అన్నీ మారే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక సినిమా ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ రీసెంట్ గా ఓపెన్ అయ్యింది….
కాగా సినిమా మెయిన్ థియేటర్స్ చైన్ బుకింగ్స్ లేట్ గా ఓపెన్ అవ్వగా ఓపెన్ అయిన తర్వాత బుకింగ్స్ ట్రెండ్ డీసెంట్ టు గుడ్ అనిపించే రేంజ్ లో స్టార్ట్ అయింది….రిలీజ్ కి ఇంకా 23 రోజులు ఉండగానే అమెరికాలో సినిమా $100K డాలర్స్ మార్క్ ని క్రాస్ చేసి దుమ్ము లేపింది…
ఇక యుకే లో కూడా సూపర్బ్ బుకింగ్స్ తో దూసుకు పోతున్న గేమ్ చేంజర్ మూవీ ఓవరాల్ గా మంచి స్టార్ట్ ను సొంతం చేసుకుంది కానీ అదే టైంలో రీసెంట్ బిగ్ పాన్ ఇండియా మూవీస్ తో పోల్చితే గేమ్ చేంజర్ బుకింగ్స్ ట్రెండ్ వీక్ గానే ఉందని చెప్పాలి ఇప్పుడు…
దేవర మూవీ 23 రోజుల ముందు 92 షోల బుకింగ్స్ లో $160K+ డాలర్స్ ను అందుకోగా గేమ్ చేంజర్ ఏకంగా 706 షోలకు $100K మార్క్ ని దాటింది…అదే టైంలో కల్కి, పుష్ప2 మూవీస్ తో పోల్చితే బుకింగ్స్ ట్రెండ్ వీక్ గా స్టార్ట్ అయింది…కానీ రిలీజ్ కి ఇంకా టైం ఉండటం…
ట్రైలర్ రిలీజ్ అయ్యాక బజ్ మరింత పెరిగి బుకింగ్స్ ట్రెండ్ మరింత జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉంది….మధ్యలో ఆచార్య ఇంపాక్ట్ అలాగే శంకర్ ఇండియన్2 ఇంపాక్ట్ లు కూడా ఉండటంతో ట్రైలర్ సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు…అప్పుడు సినిమా బుకింగ్స్ ట్రెండ్ మంచి జోరుని చూపించవచ్చు.