గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) శంకర్(Shankar) ల సెన్సేషనల్ మూవీ గేమ్ చేంజర్(Game Changer) సినిమా మీద ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి…సంక్రాంతికి మిగిలిన సినిమాల కన్నా ముందు భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్న ఈ సినిమా పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఔట్ అండ్ ఔట్ వింటేజ్ శంకర్ స్టైల్ లో…
రూపొందున్న పొలిటికల్ కమర్షియల్ మూవీగా రాబోతూ ఉండగా సినిమా అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి అని చెప్పాలి ఇప్పుడు.. ఇక సినిమా రీసెంట్ గా సెన్సార్ పనులను కూడా పూర్తి చేసుకోగా అక్కడ నుండి ఫస్ట్ టాక్ కూడా…
బయటికి వచ్చేసింది…ఒకసారి ఆ టాక్ ను గమనిస్తే…ముందుగా యు/ఏ సర్టిఫికేట్ ను సొంతం చేసుకున్న సినిమా సుమారు 2 గంటల 45 నిమిషాల రన్ టైంతో ఇప్పుడు ఆడియన్స్ ముందుకు రాబోతూ ఉండగా…స్టోరీ పాయింట్ ను పూర్తిగా రివీల్ చేయకున్నా కూడా…
అప్పుడే కొత్తగా కలెక్టర్ గా అపాయింట్ అయిన జిల్లా కలెక్ట్ అయిన హీరో కి సిస్టం లో ఎంత కరప్షన్ జరుగుతుంది లాంటివి చూసి వీటిని మార్చాలి అనిపిస్తుంది. ఈ క్రమంలో హీరో చేసిన పనులు ఏంటి అది ఏకంగా సిఎమ్ దగ్గర దాకా వెళ్ళిన తర్వాత ఏమయింది అన్నది స్టోరీ పాయింట్ గా…
చెబుతూ ఉండగా సినిమాలో ఇంకా అనేక ఉపకథలు ఉంటాయని అంటున్నారు….స్టోరీ పాయింట్ రెగ్యులర్ గానే అనిపించినా కూడా రెగ్యులర్ మూవీస్ లా కాకుండా శంకర్ మార్క్ స్క్రీన్ ప్లే తో సినిమా ఔట్ అండ్ ఔట్ మంచి మాస్ సీన్స్, ఎలివేషన్ లతో నిండిపోయిందని అంటున్నారు…
అలాగే డిఫెరెంట్ గెటప్స్ లో రామ్ చరణ్ లుక్స్ అండ్ యాక్షన్ సీన్స్ లో హీరోయిజం ఎలివేట్ సీన్స్ లాంటివి మేజర్ హైలెట్స్ అని అంటున్నారు, ఇక రిచ్ విజువల్స్ అండ్ సాంగ్స్ కోసం పెట్టిన ఖర్చు అన్నీ కూడా విజువల్ గా చాలా బాగా ఆకట్టుకుంటాయని అంటూ ఉండగా…
మొత్తం మీద సినిమా ఫస్టాఫ్ కానీ సెకెండ్ ఆఫ్ కానీ ఫుల్ రేసీ స్క్రీన్ ప్లే తో సాగుతుందని అంటున్నారు. కథ పాయింట్ ఒక్కటి నార్మల్ గా అనిపించడం, అలాగే ఇలాంటి రెగ్యులర్ కమర్షియల్ పొలిటికల్ మెసేజ్ మూవీస్ జనాలు చూసి చూసి ఉండటం లాంటివి చిన్న చిన్న…
మైనస్ లు అయినా కూడా ఫాస్ట్ స్క్రీన్ ప్లే వలన జనాలు బోర్ ఫీల్ అయ్యే అవకాశం తక్కువగా ఉండటం సినిమాకి ప్లస్ పాయింట్ అని అంటున్నారు. ఓవరాల్ గా సెన్సార్ వాళ్ళ నుండి సినిమా కి ఎబో యావరేజ్ టు హిట్ లెవల్ లో రిపోర్ట్స్ అయితే వినిపిస్తున్నాయి అని చెప్పాలి ఇప్పుడు…
పక్కా కమర్షియల్ మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ కి సినిమా నచ్చుతుంది అలాగే కామన్ ఆడియన్స్ కోరుకునే ఎలిమెంట్స్ సినిమాలో బాగానే ఉన్నాయి అని అంటూ ఉండటంతో సినిమా ఇక సంక్రాంతికి రిలీజ్ అయిన తర్వాత ఇదే రేంజ్ లో టాక్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకుంటే మాస్ కుమ్ముడు ఖాయమని చెప్పాలి ఇప్పుడు.