బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి అంచనాల నడుమ మరో స్టార్ హీరో సినిమా రిలీజ్ కానుంది…రీసెంట్ టైంలో వచ్చిన టాప్ స్టార్స్ మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్స్ తో కుమ్మేశాయి. ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) శంకర్(Shankar) ల సెన్సేషనల్ మూవీ గేమ్ చేంజర్(Game Changer) సినిమా…
వన్ ఆఫ్ ది హైయెస్ట్ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో రూపొందిన బిగ్ మూవీ కాగా సంక్రాంతికి ఓవరాల్ గా పాన్ ఇండియా రేంజ్ లో పెద్దగా పోటి ఏమి లేకుండా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఓపెనింగ్స్ ఓ రేంజ్ లో ఉంటాయని అందరూ అనుకుంటూ ఉండగా…
ప్రస్తుతానికి ఓవర్సీస్ బుకింగ్స్ మాత్రం ఏమాత్రం ఇంపాక్ట్ చూపించడం లేదు కానీ రిలీజ్ అయిన తర్వాత టాక్ బాగుంటే ప్రీమియర్స్ అండ్ డే 1 తో మంచి నంబర్స్ ను పోస్ట్ చేసే అవకాశం ఉంది, కానీ ప్రస్తుతానికి ఓవర్సీస్ రికార్డ్ ఓపెనింగ్స్ ఔట్ ఆఫ్ రీచ్ అనే చెప్పాలి…
ఇక తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతానికి ఆర్ ఆర్ ఆర్ 74.11 కోట్లతో టాప్ లో, రెండో ప్లేస్ లో పుష్ప2 70.81 కోట్లతో ఉండగా మూడో ప్లేస్ లో దేవర 61.65 కోట్ల తో ఉంది. ప్రజెంట్ గేమ్ చేంజర్ టాప్ 3 అయితే కొంచం కష్టంగానే ఉన్నప్పటికీ నైజాంలో భారీ టికెట్ హైక్స్ వచ్చి…
మొదటి రోజే సాలిడ్ హిట్ టాక్ వస్తే ఆల్ టైం టాప్ 4 ప్లేస్ లో ఉన్న సలార్ 50.49 కోట్ల షేర్ ని టార్గెట్ చేసి ముందుకు వెళ్ళొచ్చు…టాక్ ను బట్టి సినిమా ఎంతవరకు వెళుతుందో చెప్పగలం… ఇక కర్ణాటకలో బుకింగ్స్ ట్రెండ్ ఇప్పుడే స్టార్ట్ అవ్వగా…ఇంకా జోరు చూపించాల్సి ఉంది..
ఇక తమిళనాడు, కేరళ హిందీలో బజ్ ఇంకా పుంజుకోవాల్సిన అవసరం ఉండగా, ఓవరాల్ గా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి సినిమా 100-120 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక సినిమా కి వచ్చే టాక్ ను బట్టి…
అన్ని ఇండస్ట్రీలలో పెరిగే బజ్ ను బట్టి కలెక్షన్స్ ఎంతవరకు అంచనాలను అందుకుంటాయో లేక మించి పోతాయో అన్నది అంచనా వేయగలం… సోలో హీరోగా రామ్ చరణ్ ఈ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో మ్యాజిక్ చూపిస్తాడో చూడాలి ఇప్పుడు.