సంక్రాంతికి భారీ లెవల్ లో ఆడియన్స్ ముందుకు రాబోతున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) శంకర్(Shankar) ల సెన్సేషనల్ మూవీ గేమ్ చేంజర్(Game Changer) సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడగా…ట్రైలర్ రిలీజ్ కి ముందు బజ్ కన్నా కూడా ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ తర్వాత అంచనాలు మరింతగా పెరిగిపోయాయి…
ఇక బిజినెస్ పరంగా కూడా అన్ని చోట్లా మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతున్న సినిమా ఓవర్సీస్ లో మాత్రం ప్రీ బుకింగ్స్ పరంగా ఉండాల్సిన రేంజ్ లో జోరు అయితే చూపించలేక పోతుంది మొదటి నుండి కూడా… అక్కడ బుకింగ్స్ ఇతర పాన్ ఇండియా మూవీస్ తో పోల్చితే…
అసలు ఏమాత్రం న్యాయం చేసే రేంజ్ లో అయితే ఉండటం లేదు…షోలు పెంచడం లేదు అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఎన్ని ట్వీట్స్ వేసినా కూడా…ఇతర సినిమాలతో కంపేర్ చేస్తే సినిమా ఓవర్సీస్ పరిస్థితి ప్రస్తుతం ఏమంత ఆశించిన రేంజ్ లో లేదు…
రిలీజ్ కి ఇంకా 5 రోజుల టైం ఉండగా నార్త్ అమెరికాలో ఓవరాల్ గా $520K డాలర్స్ మార్క్ ని 420 కి పైగా లోకేషన్స్ లో 1240 వరకు షోలతో సొంతం చేసుకుంది…అదే టైంలో రిలీజ్ కి 5 రోజుల ఉన్నప్పుడు కల్కి మూవీ 958 లోకేషన్స్ లో 2.2 మిలియన్ డాలర్స్ మార్క్ ని దాటింది…
దేవర మూవీ 670 కి పైగా లోకేషన్స్ లో 1.8 మిలియన్ డాలర్స్ మార్క్ ని దాటింది…ఇక పుష్ప2 మూవీ 1013 లోకేషన్స్ లో 1.9 మిలియన్ మార్క్ ని అందుకుంది..ఇతర సినిమాలతో పోల్చితే గేమ్ చేంజర్ కి షోల కౌంట్ తక్కువ ఇచ్చారు అని అంటూ ఉన్నప్పటికీ…
రీజనల్ మూవీ అయిన గుంటూరు కారం రిలీజ్ 5 రోజుల ముందు 355 లోకేషన్స్ లో $520K మార్క్ ని దాటింది…రీజనల్ మూవీ కన్నా కూడా పాన్ ఇండియా క్రేజీ మూవీ బుకింగ్స్ ట్రెండ్ వీక్ గా ఉండటం ప్రస్తుతానికి ఎవ్వరికీ అంతుపట్టడం లేదు…
కానీ సినిమా ట్రైలర్ బాగానే వర్కౌట్ అవ్వడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర టాక్ బాగుంటే ఓపెనింగ్స్ ఎలా ఉన్నా లాంగ్ రన్ లో మాత్రం గేమ్ చేంజర్ మంచి జోరు చూపించే అవకాశం ఉంటుందని అందరూ ఆశిస్తున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి.