బాక్స్ ఆఫీస్ దగ్గర గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) శంకర్(Shankar) ల సెన్సేషనల్ మూవీ గేమ్ చేంజర్(Game Changer) సినిమా భారీ అంచనాల నడుమ ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ కాబోతూ ఉండగా, సినిమా మీద ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉండగా బజ్ కూడా పాజిటివ్ గా మారింది అని చెప్పాలి ఇప్పుడు…
బిజినెస్ పరంగా కూడా మంచి జోరుని చూపెడుతున్న సినిమా ఆల్ రెడీ నైజాం ఏరియాలో 43.50 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకోగా సీడెడ్ ఏరియాలో 23 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది…ఇక తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా కూడా…
ఎక్స్ లెంట్ బిజినెస్ ను పోటిలో సొంతం చేసుకుని కుమ్మేసిన సినిమా, రామ్ చరణ్ కెరీర్ లోనే సోలో హీరోగా ఆల్ టైం హైయెస్ట్ బిజినెస్ ను సొంతం చేసుకుని కుమ్మేసింది ఇప్పుడు…. ఇది వరకు వినయ విదేయ రామ్ సినిమా 77.94 కోట్ల బిజినెస్ ను తెలుగు రాష్ట్రాల్లో అందుకోగా…
తర్వాత ఎన్టీఆర్ తో కలిసి చేసిన ఆర్ ఆర్ ఆర్ మూవీ 191 కోట్ల మమ్మోత్ బిజినెస్ ను సొంతం చేసుకుంది. ఇక చిరంజీవితో కలిసి చేసిన ఆచార్య మూవీ 107.50 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకోగా ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ 122 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సాధించింది.
ఒకసారి సినిమా సాధించిన తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ లెక్కలను గమనిస్తే…
#GameChanger AP-TG Pre Release Business Details(Valued)
👉Nizam: 43.50Cr
👉Ceeded: 23Cr
👉UA: 14.20Cr
👉East: 10Cr
👉West: 8.10Cr
👉Guntur: 10.20Cr
👉Krishna: 8.50Cr
👉Nellore: 4.50Cr
AP-TG Total:- 122CR(Break Even- 124CR+)
మొత్తం మీద సినిమా 122 కోట్ల బిజినెస్ తో రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ రికార్డ్ ను అందుకోగా బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ అవ్వాలి అంటే ఇప్పుడు 124 కోట్ల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో అందుకోవాల్సి ఉంటుంది. మరి సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీ పోటిలో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.