బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) శంకర్(Shankar) ల సెన్సేషనల్ మూవీ గేమ్ చేంజర్(Game Changer) సినిమా గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధం అవ్వగా వరల్డ్ వైడ్ గా 6600 కి పైగా థియేటర్స్ లో 223 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగుతున్న ఈ సినిమా…
అడ్వాన్స్ బుకింగ్స్ ను చాలా లేట్ గా ఓపెన్ చేశారు…..నైజాంలో టికెట్ హైక్స్ పర్మీషన్ కోసం ఆపగా ఆంధ్ర లో కొంచం ముందుగా బుకింగ్స్ ను ఓపెన్ చేయగా ఓవరాల్ గా సినిమా రిలీజ్ కి ముందు రోజు వరకు చూసుకుంటే ఇండియాలో 40 కోట్ల రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ ను…
ఓవర్సీస్ లో 10 కోట్లకు పైగా గ్రాస్ బుకింగ్స్ ను సొంతం చేసుకుని 50 కోట్లకు పైగా బుకింగ్స్ తో…లేట్ అయినా మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతూ ఉండటం విశేషం… ఇక అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని చోట్లా సాలిడ్ గా ఉండగా ఓవర్సీస్ ఒక్కటి వీక్ గా అనిపిస్తున్నా…
మిగిలిన చోట్ల మాత్రం లేట్ బుకింగ్స్ తో కూడా కుమ్మేస్తున్న సినిమా ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో 60-65 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా..సినిమా కి వచ్చే టాక్ అండ్ ఆఫ్ లైన్ లెక్కలను బట్టి జోరు 65-70 కోట్ల రేంజ్ కి వెళ్ళే అవకాశం ఉంది…
ఇక హిందీలో ప్రజెంట్ బుకింగ్స్ దేవర బుకింగ్స్ కన్నా బెటర్ గా ఉన్నాయి డే 1 ఫుట్ ఫాల్స్ ఎలా ఉంటాయో చూడాలి….ఇక తమిళనాడులో మంచి బుకింగ్స్ ఉండగా కర్ణాటకలో కూడా డీసెంట్ బుకింగ్స్ ఉన్నాయి. కేరళలో బుకింగ్స్ కొంచం వీక్ గా ఉండగా…
ఓవరాల్ గా సినిమా ప్రజెంట్ బుకింగ్స్ ట్రెండ్ చూస్తుంటే మొదటి రోజు ఇండియా లో 90-95 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను ఓవర్సీస్ లో 22-25 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను ప్రీమియర్స్ అండ్ డే 1 కలెక్షన్స్ తో అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా టోటల్ వరల్డ్ వైడ్ గా మొదటి రోజు…
ప్రస్తుతం ఉన్న బుకింగ్స్ ను బట్టి 110-120 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉంది, ఇక టాక్ బాగుండి షో షో కి మాస్ రాంపెజ్ ను చూపిస్తే లెక్క ఇంకా సాలిడ్ గా పెరిగే అవకాశం ఉంది. ఇక మొదటి రోజు సినిమా ఏ రేంజ్ లో మాస్ రచ్చ చేస్తుందో చూడాలి ఇక…