నిర్మాతలతో అనుకున్న దాని కన్నా కూడా ఎప్పుడూ ఎక్కువ బడ్జెట్ పెట్టిస్తాడు అని సౌత్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన శంకర్ మీద ఎప్పటి నుండో ఒక అపవాదు ఉండేది…కానీ ఆ సినిమాలు రిలీజ్ అయిన తర్వాత క్వాలిటీ పరంగా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డుల పరంగా కానీ ఎప్పటి కప్పుడు జోరు చూపించడంతో ఈ సమస్య పెద్దగా హైలెట్ కాలేదు కానీ…
తర్వాత యావరేజ్ ఫ్లాఫ్స్ పడుతున్న టైంలో ఇవి హైలెట్ అవ్వగా ఇండియన్2 సినిమా విషయంలో ఇది పీక్స్ కి వెళ్ళింది. ఇదే టైంలో టాలీవుడ్ లో ఫస్ట్ టైం రామ్ చరణ్ తో కలిసి గేమ్ చేంజర్ సినిమా చేయడానికి ఒప్పుకున్న శంకర్ ఈ సినిమా కోసం ముందు అనుకున్న బడ్జెట్ ఒకటి అయితే…
మూడున్నర ఏళ్ళుగా సినిమా నిర్మాణం జరగడంతో బడ్జెట్ అలా అలా పెరిగి పోతూ అంచనాలను మించి డబుల్ అయిపొయింది….ముందు 220-250 కోట్ల రేంజ్ లో సినిమా పూర్తి అవుతుంది అనుకున్నారు కానీ సినిమా ఎండ్ అయ్యే టైంకి నిర్మాతలు యాక్టర్స్ చెప్పిన లెక్క ప్రకారం ఏకంగా…
425 కోట్లకు పైగా బడ్జెట్ తో సినిమా నిర్మాణం అయినట్లు సమాచారం…సినిమా చూసిన తర్వాత క్వాలిటీ పరంగా రిచ్ గా సినిమా ఉన్నప్పటికీ అసలు కథలో దమ్ము లేని దానికి ఎందుకని ఇంతలా ఖర్చు చేశారు అంటూ సినిమా చూసిన వాళ్ళు అందరూ ఓ రేంజ్ లో సినిమాను ట్రోల్ చేస్తున్నారు ఇప్పుడు….
సాంగ్స్ కోసమే ఏకంగా 75 కోట్ల రేంజ్ లో బడ్జెట్ పెట్టించగా అందులో ఒక సాంగ్ ను రిలీజ్ టైం కి ఫైనల్ ప్రింట్స్ కి యాడ్ చేయకుండా మూడో రోజు యాడ్ చేశారు….ఇక సినిమాలో అవసరం ఉన్నా లేకున్నా కూడా భారీ బడ్జెట్ తో భారీ కాన్వాయ్ తో సినిమా నిర్మాణం జరిగింది…
అలా బడ్జెట్ పెరిగిపోతూ పోతూ ఏకంగా 425 కోట్ల రేంజ్ బడ్జెట్ అవ్వగా థియేట్రికల్ బిజినెస్ వాల్యూ ఏరియాలతో కలిపి 220 కోట్లు అనుకున్నా కూడా నాన్ థియేట్రికల్ రైట్స్ ఓవరాల్ గా 150 కోట్ల రేంజ్ లో ఉందని వార్తలు వచ్చినా మేకర్స్ కి ఇంకా డెఫిసిట్ లోనే ఉండగా థియేటర్స్ లో సినిమా….
అంచనాలను మించి 300 కోట్లకు పైగా షేర్ ని అందుకుంటే రికవరీ అవుతుందని ఆశించినా ఇప్పుడు సినిమాకి వచ్చిన మిక్సుడ్ టాక్ అలాగే సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయిన నెగటివ్ టాక్ తో పాటు కలెక్షన్స్ పోస్టర్ ల ట్రోల్స్ తో ఓవరాల్ గా అంచనాలను అందుకోవడంలో గట్టిగానే విఫలం అయింది అని చెప్పాలి…కానీ సంక్రాంతి లాంగ్ వీక్ లో సినిమా ఎంతవరకు రికవరీని సొంతం చేసుకుంటుందో చూడాలి ఇప్పుడు.