వరల్డ్ వైడ్ గా భారీ అంచనాల నడుమ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) శంకర్(Shankar) ల సెన్సేషనల్ మూవీ గేమ్ చేంజర్(Game Changer) సినిమా గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకోగా సినిమా కి ప్రీమియర్స్ తర్వత యావరేజ్ టు ఎబో యావరేజ్ రేంజ్ లో రెస్పాన్స్ రాగా ఇక్కడ రెగ్యులర్ షోలకు సినిమా కి మిక్సుడ్ రెస్పాన్స్ గా మారింది ఎక్కువగా…
ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోల టైం కి సినిమా కి ఇప్పుడు ఫైనల్ గా ఎలాంటి టాక్ సొంతం అయ్యింది అన్నది ఆసక్తిగా మారగా, ఈవినింగ్ అండ్ నైట్ షోలకు ఫ్యామిలీ అండ్ కామన్ ఆడియన్స్ థియేటర్స్ కి గట్టిగానే రాగా వాళ్ళ నుండి టాక్ డిఫెరెంట్ గానే ఉందని చెప్పాలి.
ఫ్యామిలీ ఆడియన్స్ విషయానికి వస్తే సినిమాలో ఫస్టాఫ్ అంతంత మాత్రమే అనిపించినా సెకెండ్ ఆఫ్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఆకట్టుకుందని, అలాగే అంజలి రోల్ బాగా మెప్పించింది అని అంటూ ఉండగా రామ్ చరణ్ రెండు రోల్స్ లో పెర్ఫార్మెన్స్ చాలా బాగా ఆకట్టుకున్నాడని అంటున్నారు…
కానీ కెమరా యాంగిల్స్ కొంచం ఇబ్బంది పెట్టాయని చెబుతూ ఉండగా, సినిమా కొంచం బోర్ అనిపించినా కూడా రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ కోసం, అలాగే కొన్ని మంచి సీన్స్ కోసం ఒకసారి చూడొచ్చు అనిపించే రేంజ్ లో టాక్ వినిపిస్తూ ఉంది….
ఇక రెగ్యులర్ అండ్ కామన్ ఆడియన్స్ మాత్రం…ఇది అసలు శంకర్ సినిమానే కాదని అంటున్నారు. శంకర్ సినిమాల్లో ఉండే మ్యాజిక్ మళ్ళీ మిస్ అయిందని, రామ్ చరణ్ సినిమాను సేవ్ చేయడానికి తన శక్తికి మించి ట్రై చేసినా కథ లో పెద్దగా దమ్ము లేదని….దాంతో…
ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో రామ్ చరణ్ పడిన కష్టం వృదా అయిందని అంటున్నారు… రామ్ చరణ్ కోసం కొంచం ఓపిక చేసుకుని చూస్తె పర్వాలేదు అనిపించేలా ఉన్నప్పటికీ కూడా ఓవరాల్ గా సినిమా పరంగా యావరేజ్ రేంజ్ లో ఉందని అంటున్నారు ఇప్పుడు…
ఓవరాల్ గా సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ నుండి యావరేజ్ టు ఎబో యావరేజ్ మధ్యలో టాక్ వినిపిస్తూ ఉండగా….కామన్ అండ్ రెగ్యులర్ ఆడియన్స్ నుండి మిక్సుడ్ టు యావరేజ్ రేంజ్ లో రెస్పాన్స్ అయితే వినిపిస్తుంది. ఓవరాల్ గా డే ఎండ్ అయ్యే టైంకి..
గేమ్ చేంజర్ మూవీ కి ఆడియన్స్ నుండి యావరేజ్ కి అటూ ఇటూగా అయితే టాక్ వినిపిస్తుంది అని చెప్పాలి. ఇక ఈ టాక్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర రామ్ చరణ్ సంక్రాంతికి ఇతర సినిమాలను తట్టుకుని ఎలాంటి రికవరీని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోగలుగుతాడో చూడాలి ఇక….