రిలీజ్ కి ముందు వరకు పెద్దగా బజ్ ఏమి లేక పోయినా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజున గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) శంకర్(Shankar) ల గేమ్ చేంజర్(Game Changer) సినిమా హిందీ లో మంచి ఓపెనింగ్స్ తో కుమ్మేసింది….అక్కడ తొలి రోజు ఓవరాల్ గా అనుకున్న అంచనాలను మించి పోయి సాలిడ్ స్టార్ట్ ను సొంతం చేసుకోవడంతో…
లాంగ్ వీకెండ్ లో మంచి జోరు చూపించే అవకాశం ఉంది…..సినిమా హిందీ టికెట్ సేల్స్ మీద కొన్ని ట్రోల్స్ పడినా కూడా ఓవరాల్ గా మొదటి రోజు 7-8 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని గేమ్ చేంజర్ మూవీ సొంతం చేసుకునే అవకాశం ఉందని అనుకోగా సినిమా మొత్తం మీద…
ఈ అంచనాలను మించి పోయి బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజున ఓవరాల్ గా 8.64 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకుని మంచి స్టార్ట్ ను దక్కించుకుంది. ఓవరాల్ గా సౌత్ నుండి హిందీ లో డబ్ అయిన మూవీస్ లో ఒకటి గా చేరిన గేమ్ చేంజర్ మూవీ లాంగ్ వీకెండ్ లో కుమ్మేసే అవకాశం ఉంది…
ఒకసారి సౌత్ నుండి హిందీ లో రిలీజ్ అయిన మూవీస్ డే 1 కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
Hindi version South Movies Top Day 1 Collections(Dub/Direct)
👉#Pushpa2TheRule – 72CR~
👉#KGF2 – 53.95CR
👉#Bahubali2 – 41Cr~
👉#AdiPurush- 37.25CR
👉#Saaho – 24.4Cr
👉#KALKI2898AD – 22.50CR
👉#RRR- 20.07Cr
👉#2Point0 – 19.74Cr
👉#SALAAR – 15.75CR
👉#GameChanger – 8.64CR*******
👉#Devara – 7.95CR
మొత్తం మీద హిందీ లో మంచి స్టార్ట్ ను సొంతం చేసుకున్న గేమ్ చేంజర్ మూవీ వీకెండ్ లో ఇదే రేంజ్ లో జోరు కొనసాగిస్తే సంక్రాంతి పండగ అడ్వాంటేజ్ తో హిందీ లో డీసెంట్ నంబర్స్ ను పోస్ట్ చేసే అవకాశం ఉంది…. హిందీ లో క్లీన్ హిట్ కోసం సినిమా బాగానే కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు.