వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాల నడుమ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) శంకర్(Shankar) ల సెన్సేషనల్ మూవీ గేమ్ చేంజర్(Game Changer) సినిమా గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకుంది….ఈ ఇయర్ టాలీవుడ్ నుండి ఫస్ట్ బిగ్ రిలీజ్ అయిన గేమ్ చేంజర్ మూవీ ఎలా ఉంది….ఎంతవరకు అంచనాలను అందుకుందో తెలుసుకుందాం పదండీ…
ముందుగా కథ పాయింట్ కి వస్తే సిన్సియర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయిన హీరో డ్యూటీ సిన్సియర్ గా చేస్తూ ఉంటాడు…ఈ క్రమంలో హీరోకి సిఎమ్ శ్రీకాంత్ కొడుకు ఎస్ జే సూర్య తో గొడవ జరుగుతుంది….అది ఎంత దూరం వెళ్ళింది…ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే….
ఇండియాలో టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన శంకర్ నుండి సినిమా వస్తుంది అంటే ఆ సినిమా మీద అంచనాలు మరో లెవల్ లో ఉంటాయి…సోషల్ మెసేజ్ కి పెర్ఫెక్ట్ కమర్షియల్ ఎలిమెంట్స్ ను జోడించి శంకర్ తీసిన ఒకప్పటి సినిమాలు ఇప్పటికీ ఎగబడి టీవీలలో చూస్తూ ఉంటారు…కానీ ఈ మధ్య అస్సలు ఫామ్ లో లేని శంకర్…..
నుండి వచ్చిన సినిమాలు పెద్దగా అంచనాలను అందుకోవడం లేదు…గేమ్ చేంజర్ విషయంలో కథ పరంగా మరోసారి ఇదే నిజం అయింది. సినిమా ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే అప్పన్న ఎపిసోడ్ మినహా చాలా తక్కువ చోట్ల మాత్రమే శంకర్ మార్క్ కనిపించింది….రొటీన్ నార్మల్ అయిపోయిన స్టోరీ పాయింట్ కి…
తన స్టైల్ లో కమర్షియల్ ఎలిమెంట్స్ ను జోడించినా కూడా పూర్తిగా మ్యాజిక్ చేయలేక పోయాడు శంకర్..కానీ అదే టైంలో రామ్ చరణ్ మాత్రం సినిమాను అడుగడుగునా తన భుజాన మోశాడు…ముఖ్యంగా సెకెండ్ ఆఫ్ లో వచ్చే అప్పన్న రోల్ తన కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ రోల్స్ లో ఒకటిగ నిలుస్తుంది…
ఆ రోల్ లో అంతలా పెర్ఫార్మ్ చేసిన రామ్ చరణ్ సెకెండ్ రోల్ లో ఈజ్ తో పెర్ఫార్మ్ చేసి మెప్పించాడు కానీ కథలో అంతలా దమ్ము లేకపోవడంతో తన కష్టం పూర్తిగా ఫలించలేదు….కొన్ని హీరో ఎలివేషన్ సీన్స్, ఎస్ జే సూర్యతో నువ్వా నేనా అన్నట్లు సాగే సీన్స్ బాగా వచ్చాయి కానీ…
కథనే బలంగా లేక పోవడంతో ఇవి పెద్దగా ఎలివేట్ అవ్వలేదు….ఇక ఎస్ జే సూర్య కూడా మరోసారి తన మార్క్ పెర్ఫార్మెన్స్ తో కుమ్మేశాడు….కియరా అద్వాని ఓకే అనిపించగా లవ్ ట్రాక్ పెద్దగా ఏమి ఇంపాక్ట్ చూపించలేదు….తమన్ సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా కి బిగ్ ప్లస్ పాయింట్స్ అని చెప్పాలి.
ముఖ్యంగా బ్యాగ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్స్ ను చాలా బాగా ఎలివేట్ చేసింది..ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ అండ్ సెకెండ్ ఆఫ్ లో రేసీగా అనిపించినా కూడా లాగ్ ఎక్కువ అయిన ఫీలింగ్ కలిగింది…కొన్ని చోట్ల సరైన ఎడిట్ కూడా లేకపోవడంతో ఒక సీన్ నుండి ఒక సీన్ సడెన్ గా వచ్చేస్తుంది…
రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ మెప్పించగా మొత్తం మీద తెలుగు లో రెగ్యులర్ గా వచ్చే కమర్షియల్ మాస్ మూవీ లానే ఉన్న గేమ్ చేంజర్ ఎక్కడా శంకర్-రామ్ చరణ్ ల సినిమా మీద ఉండే అంచనాలు/హైప్ కి పెద్దగా న్యాయం చేయలేక పోయింది….
మొత్తం మీద రామ్ చరణ్ రెండు రోల్స్ లో చేసిన పెర్ఫార్మెన్స్, తమన్ మ్యూజిక్, ఎస్ జే సూర్య పెర్ఫార్మెన్స్, ఇంటర్వెల్ ఎపిసోడ్, సెకెండ్ ఆఫ్ అప్పన్న ఎపిసోడ్ లాంటివి హైలెట్స్ అయితే…రెగ్యులర్ కథ పాయింట్…వీక్ లవ్ స్టోరీ, ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ లాంటివి వీక్ గా ఉండటం…డ్రాగ్ అవ్వడం లాంటివి డ్రా బ్యాక్స్ అని చెప్పాలి…
ఆల్ రెడీ లో బజ్ ఉన్న మూవీ మరీ తక్కువ అంచనాలతో థియేటర్స్ కి వెళ్లి చూస్తె కొంచం రొటీన్ లానే అనిపించినా కూడా రామ్ చరణ్ కోసం ఒకసారి చూడొచ్చు…శంకర్-రామ్ చరణ్ ల బిగ్గెస్ట్ మూవీ అన్న హైప్ తో వెళ్లి చూస్తె మట్టుకు పూర్తి న్యాయం చేయలేక పోయింది సినిమా…ఓవరాల్ గా సినిమా కి మా రేటింగ్ 2.5 స్టార్స్…
Out of 5 ki 1rating kuda ekkuve modda kudsi poyindi 🤣🤣🤣🤣