Home న్యూస్ అఫీషియల్….జస్ట్ పాటల కోసమే ఇన్ని కోట్లా….ఒక పెద్ద సినిమా తీయొచ్చు!!

అఫీషియల్….జస్ట్ పాటల కోసమే ఇన్ని కోట్లా….ఒక పెద్ద సినిమా తీయొచ్చు!!

1

బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాల నడుమ సంక్రాంతికి గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధం అవుతున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) శంకర్(Shankar) ల క్రేజీ కాంబోలో రూపొందిన సెన్సేషనల్ మూవీ గేమ్ చేంజర్(Game Changer) సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. కానీ చాలా టైం గా షూటింగ్ జరుపుకుంటూ ఉండటంతో…

కొంచం బజ్ తగ్గింది, కానీ శంకర్-రామ్ చరణ్ ల క్రేజీ కాంబో కాబట్టి సినిమా ఔట్ పుట్ మినిమమ్ ఉన్నా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డుల జాతర ఈ సినిమా సృష్టించడం ఖాయమని చెప్పాలి. ఇక ప్రతీ సినిమాలో సాంగ్స్ మీద ప్రత్యేకంగా శ్రద్ధ చూపించే డైరెక్టర్ శంకర్…

ఈ సినిమా విషయంలో కూడా ఏమాత్రం ఖర్చుకి వెనకాడకుండా భారీ బడ్జెట్ తోనే సాంగ్స్ ను తీశాడని తెలుస్తుంది…ఆ సాంగ్స్ కోసం పెట్టిన ఖర్చుతో ఒక పెద్ద సినిమా కూడా తీయొచ్చు, ఆ రేంజ్ లో సాంగ్స్ కోసం ఖర్చు చేశారట…ఈ విషయాన్నీ టీం అఫీషియల్ గా కన్ఫాం కూడా చేశారు…

సినిమాలో ఉన్న టోటల్ పాటలు అన్నీ చిత్రీకరించడానికి అక్షరాలా 75 కోట్ల మమ్మోత్ బడ్జెట్ పెట్టినట్లు కన్ఫాం చేశారు….రియల్ లోకేషన్స్ లో భారీ గా డాన్సర్స్ తో సాంగ్స్ ను తీశారట..జరగండి సాంగ్ కోసం ఏకంగా 600 మంది డాన్సర్స్ తో 13 రోజులు షూట్ చేశారట…

రా మచ్చ మచ్చ సాంగ్ కోసం ఏకంగా 1000 మంది డాన్సర్స్ తో చేశారట..ఇక నానా హైరానా సాంగ్ ను అత్యాధునిక గ్రాఫిక్స్ తో తీశారని అంటున్నారు. ఇక ధోప్ సాంగ్ కోసం 100 మంది రష్యన్ డాన్సర్స్ తో తీశారట. ఇలా కేవలం పాటల కోసమే ఆల్ మోస్ట్ 75 కోట్ల ఖర్చు అయిందని అంటున్నారు..

సినిమా కోసం కూడా అనుకున్న బడ్జెట్ కి మించి భారీ బడ్జెట్ అయ్యింది అని అంటున్నారు, ఆ వివరాలు త్వరలో క్లియర్ గా రివీల్ కానుండగా…మొత్తం మీద భారీ బడ్జెట్ తో రూపొందిన గేమ్ చేంజర్ మూవీ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతికి ఎంతవరకు అంచనాలను అందుకుంటుందో చూడాలి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here