సంక్రాంతికి భారీ లెవల్ లో రిలీజ్ కి సిద్ధం అవుతున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) శంకర్(Shankar) ల క్రేజీ కాంబోలో రూపొందిన సెన్సేషనల్ మూవీ గేమ్ చేంజర్(Game Changer) సినిమా మీద ఆల్ రెడీ మంచి అంచనాలు ఏర్పడగా ట్రైలర్ రిలీజ్ కి ముందు వరకు బజ్ కొంచం తక్కువగానే ఉన్నప్పటికీ కూడా…
ట్రైలర్ రిలీజ్ తర్వాత బజ్ అమాంతం పెరిగే అవకాశం ఎంతైనా ఉండగా సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పోటి ఉన్నప్పటికీ కూడా ఉన్నంతలో భారీ లెవల్ లో రిలీజ్ కానుండగా ఇతర భాషల్లో ఎలాంటి రిలీజ్ ను సొంతం చేసుకుంటుంది అన్నది ఆసక్తి గా మారగా…
డైరెక్టర్ శంకర్ సొంత గడ్డ అయిన తమిళనాడులో ఈ సినిమా ను భారీ ఎత్తున రిలీజ్ చేయాలనీ ట్రై చేసినా సంక్రాంతికి అక్కడ టాప్ స్టార్స్ లో ఒకరైన అజిత్ కుమార్ నటించిన విదా ముయార్చి మూవీ అనౌన్స్ చేయడంతో తమిళనాడులో గేమ్ చేంజర్ కి ఇక ఎదురు దెబ్బ ఖాయమని…
అందరూ అనుకున్నారు….అజిత్ లాంటి టాప్ స్టార్ మూవీ ముందు డబ్బింగ్ మూవీ నిలబడాలి అంటే కష్టమే అని అనుకుంటూ ఉండగా సడెన్ గా ఇప్పుడు టెక్నికల్ కారణాల వలన అజిత్ సినిమా ను సంక్రాంతి కి రిలీజ్ చేయడం లేదని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు…
దాంతో మనలాగే తమిళ్ వాళ్ళకి బిగ్గెస్ట్ ఫెస్టివల్ లో ఒకటైన సంక్రాంతికి అసలు పెద్ద సినిమానే లేకుండా పోయింది ఇప్పుడు…దాంతో ఇప్పుడు అక్కడ టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ చేసిన గేమ్ చేంజర్ సినిమా నే బిగ్ మూవీ గా కనిపిస్తూ ఉన్న నేపధ్యంలో…
సినిమాకి ఏమాత్రం టాక్ బాగా వచ్చినా కూడా తమిళనాడులో గేమ్ చేంజర్ మూవీ మాస్ కుమ్ముడు కుమ్మే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ట్రైలర్ అనుకున్న రేంజ్ లో క్లిక్ అయ్యి పాజిటివ్ టాక్ వస్తే అక్కడ గేమ్ చేంజర్ మాస్ జాతర ఖాయమని చెప్పొచ్చు… మరి ఇది ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి.