Home న్యూస్ గేమ్ చేంజర్ ట్రైలర్ రివ్యూ….ఊరమాస్ రాంపెజ్!!

గేమ్ చేంజర్ ట్రైలర్ రివ్యూ….ఊరమాస్ రాంపెజ్!!

0

సంక్రాంతికి భారీ అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు రాబోతున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) శంకర్(Shankar) ల క్రేజీ కాంబోలో రూపొందిన సెన్సేషనల్ మూవీ గేమ్ చేంజర్(Game Changer) సినిమా మీద మంచి అంచనాలు ఉన్నప్పటికీ ఆ అంచనాలను మరింతగా పెంచడానికి ఒక సాలిడ్ ట్రైలర్ అవసరం ఉండగా…

సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ రిలీజ్ కి ముందు వరకు సినిమా మీద ఎలాంటి అంచనాలు ఉన్నప్పటికీ ట్రైలర్ రిలీజ్ తర్వాత మాత్రం సినిమా మీద అంచనాలు అమాంతం పెరిగిపోయాయి అనే చెప్పాలి ఇప్పుడు..ఒకప్పటి వింటేజ్ శంకర్ డైరెక్షన్ లో వచ్చే…

పొలిటికల్ అండ్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీస్ ని తలపిస్తూ గేమ్ చేంజర్ ట్రైలర్ ఔట్ అండ్ ఔట్ మాస్ రాంపెజ్ ను చూపించి మెప్పించింది. ప్రజల పక్షంలో నిలిచే నాయకుడిగా, పోలిస్ గా, కలెక్టర్ గా డిఫెరెంట్ గెటప్స్ లో రామ్ చరణ్ అదరగొట్టేశాడు ట్రైలర్ లో…

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన గేమ్ చేంజర్ లో పెట్టిన ప్రతీ పైసా కనిపించేలా ఎక్స్ లెంట్ విజువల్స్ తో ఓ రేంజ్ గ్రాండియర్ తో ట్రైలర్ ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. విజువల్స్ టాప్ నాట్చ్ అనిపించేలా మెప్పించగా తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఓకే అనిపించేలా ఉన్నప్పటికీ…

ఒకప్పటి శంకర్ మూవీస్ ట్రైలర్ లతో పోల్చితే తమన్ ఆ రేంజ్ లో బ్యాగ్రౌండ్ స్కోర్ ని ఇవ్వలేక పోయాడు ట్రైలర్ వరకు….పొలిటికల్ ఫ్లేవర్ ఉన్నప్పటికీ కంప్లీట్ పక్కా కమర్షియల్ మాస్ మూవీగా రాబోతున్న గేమ్ చేంజర్ సినిమా ట్రైలర్ తో సినిమా ఎలా ఉండబోతుంది అన్నది ఒక క్లారిటీ వచ్చేసింది…

కరప్ట్ ముఖ్యమంత్రి అయిన ఎస్ జే సూర్యకి, సిన్సియర్ కలెక్టర్ అయిన హీరోకి మధ్య జరిగే పోటినే గేమ్ చేంజర్….ముఖ్యమంత్రిని ఒక కలెక్టర్ ఎలా అడ్డుకున్నాడు… అది తన లైఫ్ ని ఎలా టర్న్ చేసింది, ఆ తర్వాత కథ ఏంటి అనేది సినిమా కథగా ట్రైలర్ చూస్తె అర్ధం అవుతుంది.

ఔట్ అండ్ ఔట్ శంకర్ మార్క్ సీన్స్ అండ్ ఎలివేషన్స్ తో ఫాస్ట్ ఫేస్ స్క్రీన్ ప్లే తో ఉండబోతున్న గేమ్ చేంజర్ ట్రైలర్ ఇచ్చిన రేంజ్ కిక్ సినిమా కూడా ఇస్తే ఇక సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ జాతర ఖాయమని చెప్పొచ్చు. ఇక ట్రైలర్ 24 గంటల్లో ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ సొంతం అవుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here